1. యెహోవా మహిమ కెరూబుల నుండి ఏమియై మందిరపు "గడప" దగ్గర దిగి నిలిచెను?
2. ఎవరి కంఠస్వరము వలన "గడప" కమ్ముల పునాదులు కదిలెను?
3. మందిరపు "గడప"క్రింద నుండి నీళ్లు ఉబుకుతూ ఎటుగా పారుచుండెను?
4. ఎవరి ఉపపత్నియింటి ద్వారమునొద్ద చేతులు "గడప" మీద చాపి పడియుండెను?
5. దేని యెదుట దాగోను యొక్క తల, రెండు అరచేతులు తెగవేయబడి "గడప" దగ్గర పడియుండెను?
6. యరొబాము భార్య ఎవరి యొద్ద నుండి ఇంటి లోగిలి ద్వారా "గడప"యొద్దకు రాగానే ఆమె బిడ్డ చనిపోయెను?
7. యెహోవా మహిమ మందిరపు "గడప"దగ్గర నుండి బయలు దేరి వేటికి పైతట్టు నిలిచెను?
8. మందిరపు తూర్పు తట్టుగుమ్మపు మొదటి "గడప"వెడల్పు ఎంత?
9. ఎక్కడ "గడపల" కెదురుగా నేల నుండి కిటికీ వరకు బల్ల కూర్పబడెను?
10. యెహోవా "గడపల" దగ్గర ఇశ్రాయేలీయులు గడపలు కట్టి ఏమి చేసిరి?
11. నీనెవె పట్టణపు "గడపల" మీద ఏమి కనుపించును?
12. యెహోవా మందసము ఎదుట దాగోను నేలను బోర్లా పడుట వలన దాని గుడికి వచ్చువారు దేనిలో దాని గుడి "గడపను" త్రొక్కుటలేదు?
13. "గడపలు" దాటి వచ్చి ఎవరి ఇంటిని మోసము,బలత్కారముతో నింపువారిని శిక్షింతునని యెహోవా అనెను?
14. అనుదినము యెహోవా "గడప"యొద్ద కనిపెట్టుకొని ఆయన యొక్క దేనిని వినువారు ధన్యులు?
15. మందిరపు "గడప"క్రింద నుండి పారే నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు ఏమి పెరుగును?
Result: