Bible Quiz in Telugu Topic wise: 304 || తెలుగు బైబుల్ క్విజ్ ("గడియ (గడ)" అనే అంశముపై క్విజ్)

1. దేనికి అడ్డుగా పెట్టు కర్రలను గడియ(గడ) అని అనెదరు?
ⓐ ప్రాకారమునకు
ⓑ గవునులకు
ⓒ ద్వారబంధములకు
ⓓ తలుపు ద్వారమునకు
2. ఏది పట్టణపు గడియలు తీసి జనులను మ్రింగివేయును?
ⓐ నాశనము
ⓑ జగడము
ⓒ యుద్ధము
ⓓ కలహము
3. గడియలు అమర్చకయు నిశ్చింతగా నివసించు జనముమీద పడుడని యెహోవా ఎవరికి వాక్కు నిచ్చెను?
ⓐ ఐగుప్తునకు
ⓑ హసోరునకు
ⓒ ఎదోమునకు
ⓓ సిరియకు
4. ఎగువ దిగువలో ఏ ప్రాంతమును సొలొమోను అడ్డుగడియలు గల ప్రాకారపట్టణముగా కట్టించెను?
ⓐ బేత్ హారోను
ⓑ బేతలు
ⓒ బెయేర్షీబా
ⓓ బయలిన్నోము
5. దావీదు ద్వారములును అడ్డుగడియలు గల పట్టణములో మూయబడియున్నాడని ఎవరు అనుకొనెను?
ⓐ ఆకీషు
ⓑ సౌలు
ⓒ అబ్నేరు
ⓓ అబ్షాలోము
6. మత్స్యపు గుమ్మములను ఏ వంశస్థులు కట్టి తలుపులు నిలిపి గడియలను అమర్చిరి?
ⓐ సాదోకు
ⓑ హమ్మేయా
ⓒ హస్సెనాయా
ⓓ మెరెమోతు
7. దేనికి సరిహద్దు నియమించి దానికి యెహోవా అడ్డుగడియలు ఏర్పర్చెను?
ⓐ కొండలకు
ⓑ నదులకు
ⓒ దిక్కులకు
ⓓ సముద్రమునకు
8. ఏవి నగరు తలుపుల అడ్డుగడియలంత స్థిరములు?
ⓐ జగడములు
ⓑ కలహములు
ⓒ వివాదములు
ⓓ యుద్ధములు
9. ఏ గడియలను యెహోవా విడగొట్టును?
ⓐ పట్టణపు
ⓑ ఇనుప
ⓒ ఇత్తడి
ⓓ నగరుల
10. దేని యొక్క అడ్డుగడియలు విరిగిపోయెను?
ⓐ బబులోను
ⓑ ఎదోము
ⓒ అష్షూరు
ⓓ దమస్కు
11. ప్రాకారములును అడ్డుగడియలును లేని దేశము మీదికీ పోయెదనని అనుచున్నదెవరు?
ⓐ ఫరో
ⓑ గోగూ
ⓒ నెబో
ⓓ నో
12. నేను మరెన్నటికి ఎక్కిరాకుండ భూమి గడియలు వేయబడియున్నవని అనుచున్నదెవరు?
ⓐ దావీదు
ⓑ యోబు
ⓒ యోనా
ⓓ యోవేలు
13. ఏ పట్టణపు అడ్డుగడియలను యెహోవా తుత్తునియలుగా కొట్టిపాడుచేసెను?
ⓐ తర్షీషు కుమారి
ⓑ ఎదోము కుమారి
ⓒ కల్దీయులకుమారి
ⓓ సీయోను కుమారి
14. దేని యొక్క అడ్డుగడియలను అగ్ని కాల్చుచున్నది?
ⓐ నోఆమోను
ⓑ నీనెవె
ⓒ దమస్కు
ⓓ గాతు
15. నా చేతులు, వ్రేళ్ళ నుండియు ఏది గడియల మీద స్రవించెనని షూలమ్మితీ అనెను?
ⓐ అత్తరు
ⓑ సుగంధ సంభారము
ⓒ జటామాంసి
ⓓ పరిమళద్రవ్యము
Result: