1. యెహోవాను వేడుకొనుటకు తన "గదిలో" నుండి ఎవరు రావలయును?
2. తన ఇంటి పై "గది"కిటికీలు యెరూషలేము తట్టున తెరువబడియుండగా ఎవరు యెహోవాకు ప్రార్ధించెను?
3. ఎవరిని తాను చేసిన వంటకమును "గది" లోనికి తీసుకొని రమ్మని ఆమ్నోను అనెను?
4. ఎలీషా ప్రవక్త తన శిష్యులలో ఒకనిని పోయి ఎవరిని లోపలి "గదిలోనికి తీసుకొని పోయి రాజుగా అభిషేకించమనెను?
5. దేవుని మందిరపు "గది"మీద ఎవరిని నెహెమ్యా నిర్ణయించెను?
6. ఏ దేశములో కప్పలు రాజుల "గదుల" లోనికి వచ్చెను?
7. పడక "గదిలో " ఎవరిని శపించకూడదు?
8. తన "గదులలో" నుండి యెహోవా వేటికి జలధారలనిచ్చును?
9. బయట ఆవరణమునకు యెహోవా దూత ఎవరిని తీసుకొని రాగా అచ్చట "గదులు" అతనికి కనబడెను?
10. ఎక్కడ యెహోవా తన "గదుల" దూలములను వేసియుండెను?
11. ప్రార్ధన చేయునపుడు "గది"లోనికి వెళ్ళి ఎక్కడ చూచు తండ్రికి ప్రార్ధన చేయవలెను?
12. "గదుల" యందు చెవిలో చెప్పుకొనునవి ఎక్కడ చాటింపబడునని యేసు చెప్పెను?
13. ఏమి భుజించుటకు విడిది "గది" ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని ఇంటి యజమానుని శిష్యులు అడిగెను?
14. క్రీస్తు లోపల "గదిలో" నున్నాడని అబద్ధ ప్రవక్తలు బోధకులు చెప్పిన యెడల ఏమి చేయకూడదు?
15. ప్రతిష్టార్పణలు స్వేచ్ఛార్పణలు ఎక్కడ యున్న యెహోవా మందిరపు ఖజానా "గదులలో ఉంచిరి?
Result: