① Singers అనగ అర్ధము ఏమిటి?
② ఇశ్రాయేలీయుల స్తోత్రగీతములను మధురగానము చేసిన "గాయకుడు"ఎవరు?
③ ఎలా స్వరములెత్తి పాడునట్లు "పాటకులను"ఏర్పాటు చేయుమని దావీదు లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను?
④ యెహోవా మందిరములోని "గాయకులకు" ఏమి వేయుట కట్టడపు న్యాయము కాదని తెలుసుకొనుమని ఎజ్రా జనులతో అనెను?
⑤ వేటి చేత సొలొమోను రాజు "గాయకులకు" సీతారాలను స్వరమండలములను చేయించెను?
⑥ ఎవరి పితరులలో పెద్దలైన "గాయకులు" రాత్రింబగళ్లు పని విచారణ కలిగియుండిరి?
⑦ . "పాటకులును "పాటకుల పనికి విచారణకర్త యగు ఎవరు సన్నపునారతో చేయబడిన వస్త్రములు ధరించుకొనియుండిరి?
⑧ ఏ రాజు స్తంభము దగ్గర నిలువబడియుండగా "గాయకులు"వాద్యములతో స్తుతి పాటలు పాడిరి?
⑨. ఏ రాజు జనుల నిమిత్తము యాజకులచే పాప పరిహారార్ధబలి చేయించునపుడు "గాయకులు"పాటలు పాడిరి?
①⓪ "గాయకులలో" నూట ఇరువది యెనమండుగురు ఎవరి వంశస్థులు?
①① . ఏ రాజు ఏలుబడి యందు "గాయకులు" యెరూషలేము పట్టణము వచ్చిరి?
①② ఇశ్రాయేలీయులును లేవీయులును వేటిని తేగా "గాయకులు"వాటిని ప్రతిష్టించిరి?
①③ గాయకులు"వంతుల ప్రకారము ఎలా తమ పనిచేయవలెను?
①④ లేవీయులకు అందవలసిన పాళ్లు వారికి అందకపోవుట చేత సేవచేయు "గాయకులు" పారిపోయిరని ఎవరు తెలుసుకొనెను?
①⑤ "గాయకులు"దావీదును సొలొమోనును ఆజ్ఞాపించినట్లు తమ యొక్క దేని గూర్చిన పనులను నెరవేర్చుచు వచ్చిరి?
Result: