1. "గాలి " అనగా నేమి?
2. నేలమంటితో దేవుడు నరుని నిర్మించి ఎక్కడ "జీవవాయువును ఊదెను?
3. దేవుడు బలమైన "తూర్పుగాలి"ని రప్పించి దేనిని రెండుగా విభజించెను?
4. యెహోవా "సుడిగాలి "చేత ఎవరిని ఆకాశమునకు కొనిపోయెను?
5. ఎవరు విసిరి వెళ్ళి మరలిరాని"గాలి" వలె ఉన్నారని దేవుడు జ్ఞాపకము చేసికొనెను?
6. సూర్యుని క్రింద పడిన ఏది "గాలి" వంటిది
7. "గాలి" ఏ చోటను విసరును?
8. ఎవరు "గాలి" చెదర గొట్టు పొట్టువలె నుందురు?
9. యేసు "గాలిని" గద్దింపగా అది ఏమాయెను?
10. ఎవరివి "గాలి" మాటలని యోబు అనెను?
11. ఎఫ్రాయిము దేనిని మేయుచున్నాడు?
12. "గాలికి" కదులుచున్న రెల్లును చూచుటకు అరణ్యములోకి వెళ్ళితిరని యేసు ఎవరిని అనెను?
13.శత్రువుల "పెనుగాలి" నుండి తప్పించుకొని అరణ్యములోనికి పారిపోవుదునని ఎవరు అనెను?
14. "గాలి" విసిరి కొట్టిన గాని పడని పునాది గల ఇల్లు దేని మీద కట్టబడెను?
15. వేటి మీద యెహోవా గమనము చేయుచున్నాడు?
Result: