Bible Quiz in Telugu Topic wise: 310 || తెలుగు బైబుల్ క్విజ్ ("గిలాదు" అనే అంశము పై క్విజ్)

1. "గిలాదు" అనగా అర్ధము ఏమిటి?
ⓐ ఎత్తైన కొండ
ⓑ సాక్ష్యపు కొండ
ⓒ లోహముల కొండ
ⓓ వృక్షముల కొండ
2. ఎవరి వంశమునకు చెందిన "గిలాదు"అను పేరు మీద ఆ కొండకు పేరు పెట్టబడెను?
ⓐ ఎఫ్రాయిము
ⓑ మనషే
ⓒ రూబేను
ⓓ బెన్యామీను
3. "గిలాదు" ఏ నదికి తూర్పు వైపున కలదు?
ⓐ నిమ్రీము
ⓑ హేలాను
ⓒ యూఫ్రటీస్
ⓓ యొర్దాను
4. "గిలాదు"దేనికి ప్రసిద్ధి చెందినది?
ⓐ ఔషధములకు
ⓑ మానులకు
ⓒ లోహములకు
ⓓ విలువైన రాళ్ళకు
5. "గిలాదులో దొరికే ఔషధములు ఏమిటి?
ⓐ గుగ్గిలము
ⓑ మస్తకి
ⓒ బోళము
ⓓ పైవన్నియు
6. "గిలాదు"వాడైన ఎవరు పరాక్రమము గల బలాఢ్యుడు?
ⓐ సమ్సోను
ⓑ ఒత్నీయేలు
ⓒ కనజు
ⓓ యెఫ్తా
7. "గిలాదునకు"వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుమని యెహోవా ఎవరితో అనెను?
ⓐ ఎదోముకుమారితో
ⓑ ఐగుప్తుకుమారితో
ⓒ కల్దీయులకుమారితో
ⓓ తర్షీషుకుమారితో
8. ఇనుప పనిముట్లతో "గిలాదును" నూర్చినది ఎవరు?
ⓐ దమస్కు
ⓑ గాజా
ⓒ ఎదోము
ⓓ తూరు
9. "గిలాదులో" గుగ్గిలము లేదా,నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవుచున్నదని అను యెహోవా వాక్కును తెలిపిన ప్రవక్త ఎవరు?
ⓐ యెషయా
ⓑ యిర్మీయా
ⓒ యోవేలు
ⓓ ఆమోసు
10. "గిలాదు" యొర్దాను అద్దరిని నిలిచెను అని కీర్తనలో పాడినదెవరు?
ⓐ మిర్యాము
ⓑ యెహోషువ
ⓒ దెబోరా
ⓓ బిలాము
11. ఎవరితో యుద్ధము చేయుటకు అమ్మోనీయులు "గిలాదులో దిగియుండిరి?
ⓐ మిద్యానీయులతో
ⓑ ఫిలిష్తీయులతో
ⓒ మోయాబీయులతో
ⓓ ఇశ్రాయేలీయులతో
12. తమ యొక్క వేటిని మరి విశాలము చేయదలచి అమ్మోనీయులు "గిలాదులోని" గర్భిణి స్త్రీల కడుపులను చీల్చిరి?
ⓐ ప్రాకారములను
ⓑ గోపురములను
ⓒ సరిహద్దులను
ⓓ కోటలను
13. ఇశ్రాయేలు వారు "గిలాదులోను" మేయుచు ఏమి నొందును?
ⓐ ఆనందము
ⓑ సంతుష్టి
ⓒ ఉల్లాసము
ⓓ సమృద్ధి
14. "గిలాదు"ఎవరి పట్టణమాయెను?
ⓐ దుష్టుల
ⓑ పేదల
ⓒ పాపాత్ముల
ⓓ మూర్ఖుల
15. నిజముగా "గిలాదు"చెడ్డది, అచ్చటివి వ్యర్ధములని ఏ ప్రవక్త యెహోవా వాక్కును ప్రవచించెను?
ⓐ ఆమోసు
ⓑ యిర్మీయా
ⓒ యోవేలు
ⓓ హోషేయా
Result: