①. "Group" అనగా అర్ధము ఏమిటి?
②. హతమవ్వకుండా యుండుటకు తనతో నున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు "గుంపు"లుగా చేసినదెవరు?
③. బాధాకరమైన ఏ "గుంపు"లు ఫరో అతని సేవకుల యిండ్లలోనికి వచ్చెను?
④. ఎవరు "గుంపు"కూడి నన్ను ఆవరించియున్నారని దావీదు అనెను?
⑤. మనుష్యులు ఏమి చేయవలెనని "గుంపు"కూడి పొంచియుందురు?
⑥. ఎవరు "గుంపు"కూడి ప్రాణము తీయజూచుదురు?
⑦. భూమి నెరవిడిచి ఎవరి "గుంపు"ను కప్పివేసెను?
⑧. ఎవరు తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని తెలిసికొని "గుంపు"కూడిరి?
9. ఇశ్రాయేలు జనుల మీద యుద్ధము చేయుటకు ఎవరు ఆలచందల చేనిలో "గుంపు"కూడిరి?
10. ఎవరు "గుంపు"కూడిన ఉత్సవసమాజమును నేనోర్చజాలనని యెహోవా అనెను?
①①. ఆబోతుల "గుంపు"ను దూడల వంటి జనములును లొంగి ఏమి తెచ్చునట్లుగా వారిని గద్దింపుమని దావీదు యెహోవాతో అనెను?
①②. యెరూషలేము పిల్లలు యెహోవాను విడిచి ఎవరి యిండ్లలో "గుంపు"లు కూడుదురు?
①③. ఎక్కడ సకలజాతి జంతువులును "గుంపు"లుగా కూడును?
①④. గుంపులు గుంపులుగా" వేటిని సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటినని యెహోవా అనెను?
①⑤. జనములు "గుంపులు గుంపులుగా"వచ్చి యాకోబు యొక్క ఎక్కడికి మనము వెళ్ళుదము రండని చెప్పుకొందురు?
Result: