1. ఎవరు తన సహోదరులను "గురుతు" పట్టెను గాని వారతని "గురుతు"పట్టలేదు?
2. ఎవరి దేవతలకు యెహోవా తీర్పు తీర్చినపుడు ఇశ్రాయేలీయుల యిండ్ల మీద పస్కాబలి పశువు రక్తము"గురుతుగా"నుండును?
3. ఎవరిని కనుగొని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక "గురుతు"వేసెను?
4. ఎక్కడ ఉంచిన యెహోవా ధనుస్సు ఆయనకు భూమికిని మధ్య నిబంధనకు "గురుతుగా"నుండును?
5. వేటిని ఆచరించుట వలన ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచు యెహోవా ఆయనే అని ఆది తరతరములకు "గురుతు "అగును?
6. రధాధిపతులు ఎవరిని ఇశ్రాయేలు రాజు కాదని "గురుతు"పట్టి అతని తరుముట మానిరి?
7. మా అడుగుజాడలను "గురుతు"పట్టి దుష్టులు మమ్ము చుట్టుకొనియున్నారని ఎవరు యెహోవాకు ప్రార్ధన చేసెను?
8. కలలో కనబడిన ఒక రూపమును నేను "గురుతు"పట్టలేకపోతినని ఎవరు అనెను?
9. దేశమున సంచరించు వారు తెలియజేసిన సంగతులు మీరు "గురుతు"పట్టలేదా? అని ఎవరు తన స్నేహితుతో అనెను?
10. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని కోరుచున్న యోబు ఏది నా యొక్క "గురుతు"అనెను?
11. ఎటువంటి మాటలు పలుకువాడు వ్రేళ్ళతో "గురుతులు"చూపును?
12. సీయోను యొక్క ఎవరిని చూచువారు వారిని "గురుతు"పట్టజాలరు?
13. ఎవరు కర్కాటముతో "గురుతు"పెట్టి పనికిరాని విగ్రహమును రూపించును?
14. దేనిని "గురుతు"పట్టువాడు విత్తడు?
15. వివాస్పదమైన "గురుతుగా"యేసు నియమింపబడియుండెనని ఎవరు అనెను?
Result: