1. దావీదు ఏ దేశమందలి కొందరిని "గొడ్డళ్లతో" నరికించెను?
2. యెహోవా మందిరమును కట్టుస్థలములో "గొడ్డలి" వంటి వేటి ధ్వని యెంతమాత్రమును వినబడలేదు?
3. ఇశ్రాయేలీయులు తమ "గొడ్డండ్రకు" పదును చేయించుకొనుటకు ఎవరి యొద్దకు పోయెను?
4. తన శిష్యుడైన ఒకని "గొడ్డలి" నీటిలో పడగా ఆ స్థలములో కొమ్మ వేసి దానిని తేల చేయించిన ప్రవక్త ఎవరు?
5. ఒకడు చెట్టు నరుకుచుండగా పొరపాటున "గొడ్డలి"పిడి ఊడి పొరుగువాని మీద పడి ఆతను చనిపోతే వానికి ఏ విధి యుండదు?
6. ఒక పురమును లోబరుచుకొనుటకు యుద్ధము చేయునాడు దాని చెట్లు " గొడ్డలి"చేత ఏమి చేయకూడదు?
7. ఎవరు యెరూషలేము యొక్క కోటలను "గొడ్డండ్రతో" పడగొట్టునని యెహోవా సెలవిచ్చెను?
8. "గొడ్డలి" తనతో ఏమి చేయువాని చూచి అతిశయపడునా? అని యెహోవా అడుగుచుండెను?
9. ఎవరు "గొడ్డలి"పదును చేయుచు నిప్పులతో పనిచేయును?
10. జనముల ఎటువంటి ఆచారములు పనివాడు అడవిలో "గొడ్డలితో"చెట్లు నరకబడడము వంటివి?
11. మ్రానులు నరుకువారి వలె శత్రువులు "గొడ్డండ్లు"పట్టుకొని ఎవరి మీద పడుదురు?
12. షెకెములో ఎవరు "గొడ్డలిని"చేత పట్టుకొని చెట్టు యొక్క పెద్ద కొమ్మను నరికెను?
13. శత్రువులు ఎటువంటి చెట్ల గుబురు మీద జనులు "గొడ్డండ్ల" నెత్తినట్లుగా కనబడును?
14. "గొడ్డలి "చెట్టు వేరున ఉన్నది ఏమి ఫలించని ప్రతిచెట్టు నరుకబడి అగ్నిలో వేయబడును?
15. యెహోవా ఎవరికి "గండ్ర గొడ్డలి" వంటివాడు?
Result: