1. దేవుని యిల్లంతటిలో నమ్మకముగా నున్నది ఎవరు?
2. దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకముగా యున్నది ఎవరు?
3. నమ్మకమైన వానికి ఏమి మెండుగా కలుగును?
4. యెహోవా యందు నమ్మిక యుంచి ఏమి చేయవలెను?
5. నమ్మకమైన ఎవరిని పుట్టింతునని యెహోవా అనెను?
6. యెహోవా యందు నమ్మిక యుంచువాడు ఏమగును?
7. తన మనస్సును నమ్ముకొనిన వాడు ఎవడు?
8. యెహోవాను నమ్ముకొనిన ఆయన మన యొక్క దేనిని నెరవేర్చును?
9. యెహోవాను నమ్ముకొనిన వాడు ఏమగును?
10. లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నానని ఎవరు యేసుతో అనెను?
11. నమ్మకమైన రాయబారి ఎటువంటివాడు?
12. యెహోవా యొద్ద నివసించునట్లు ఎక్కడ యున్న నమ్మకస్థులైన వారిని ఆయన కనిపెట్టుచున్నాడు?
13. భయపడకుము, నమ్మికమాత్రముంచుమని యేసు సమాజమందిరముఅధికారి యైన ఎవరితో అనెను?
14. నమ్మువానికి సమస్తము ఏమై యున్నదని యేసు అనెను?
15. మరణము వరకు నమ్మకముగా నుండువానికి దేవుడు ఏమి ఇచ్చును?
Result: