1. వరదీసిన కత్తిని దేనిమీద చాపిన యెహోవా దూతను చూచి దావీదు పెద్దలును "గోనెపట్ట"కట్టుకొని సాష్టాంగపడిరి?
2. ఏలీయా ప్రవక్త చెప్పిన యెహోవా మాటలు వినిన ఏరాజు "గోనెపట్ట"కట్టుకొని ఉపవాసముండెను?
3. అష్షూరు రాజైన సన్హెరీబు సేవకుడైన రబ్జాకే పలికిన మాటలు విని ఏ రాజు "గోనెపట్ట"కట్టుకొని యెహోవా మందిరములోనికి పోయెను?
4. యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రహించిన ఎవరు "గోనెపట్ట"కట్టుకొని ఉపవాసముండెను?
5. ఇశ్రాయేలు దేశమునకు ఏమి వచ్చినప్పుడు అందరు "గోనెపట్ట"కట్టుకొందురని యెహోవా సెలవిచ్చెను?
6. ఎవరు సంతవీధులలో "గోనెపట్ట"కట్టుకొందురు?
7. ఏ నివాసినులను యెహోవా "గోనెపట్ట"కట్టుకొనుమనెను?
8. ఏమిగల కన్యలను వణికి నడుములకు "గోనెపట్ట"కట్టుకొనుమని యెహోవా సెలవిచ్చెను?
9. పట్టణములు పాడై ఎలా నుండినందుకై "గోనెపట్ట"కట్టుకొనుమని యెహోవా సెలవిచ్చెను?
10. దేని పెద్దలు మౌనులై "గోనెపట్ట"కట్టుకొందురు?
11. దేనికి యెహోవా "గోనెపట్ట"ధరింపజేయుచుండెను?
12. నా చర్మము మీద నేను "గోనెపట్ట" కూర్చుకొంటినని ఎవరు అనెను?
13. ఎవరిని "గోనెపట్ట"కట్టుకొని అంగలార్చుమని యోవేలు అనెను?
14. ఏ పట్టణము నాశనమగునని యోనా ప్రకటించగా ఆ రాజు విని "గోనెపట్ట"కట్టుకొని బూడిదలో కూర్చుండెను?
15. యాకోబు తన నడుముకు "గోనెపట్ట" కట్టుకొని ఏ కుమారుని కొరకు అంగలార్చెను?
Result: