1Q. అతనికి అలంకారమును "ఘనత"యు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ఎటువంటి వస్త్రములను కుట్టవలెను అని దేవుడు మోషే తో చెప్పెను?
2Q. ఒక ముద్దలోనుండియే యొక ఘటము "ఘనత"కును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద ఎవరికి అధికారము.?
3Q. యెహోవా మహా "ఘనత" వహించినవాడు ఆయన బహుగా ఏమి నొంద తగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు.?
4 Q. "ఘనత" నొంది యుండియు ఎవరు నశించు జంతువులను పోలియున్నారు.?
5Q. ప్రవక్త స్వదేశములో "ఘనత" పొందడని ఎవరు సాక్ష్యమిచ్చెను?
6 Q. "ఘనత"వహించిన థెయొఫిలా ఈ మాట యే పుస్తకంలో చూడగలము?
7Q. యెహోవా మహా "ఘనత" నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు వేటితో సీయోనును నింపెను.?
8 Q. నెనరుగల స్త్రీ "ఘనత" నొందును. బలిష్ఠులు దేనిని చేపట్టుదురు.?
9Q. పరిశుద్ధతయందును "ఘనత"యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని------.?
10 Q. ఎవరు "ఘనత"ను స్వతంత్రించుకొందురు. బుద్ధిహీనులు అవమానభరితులగుదురు.?
11Q. దేవుడు తక్కువ దానికే యెక్కువ "ఘనత" కలుగజేసి దేనిని అమర్చియున్నాడు.?
12 Q. సత్ క్రియను ఓపికగా చేయుచు,మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి దేవుడు ఏమి ఇచ్చును.?
13 Q. ఘనతకు ముందు ఏముండును?
14Q. ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఏమి గిట్టదు.?
15: సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట ఎవరికి ఘనత.?
Result: