Bible Quiz in Telugu Topic wise: 329 || తెలుగు బైబుల్ క్విజ్ ("చంద్రుడు" అనే అంశము పై క్విజ్)

1. ఆకాశవిశాలమున దేవుడు ఉంచిన మరొకటి ఏమిటి?
ⓐ చిన్నజ్యోతి
ⓑ మేఘము
ⓒ ఆవిరి
ⓓ వాయువు
2. చిన్న జ్యోతి రాత్రిని ఏమి చేయును?
ⓐ విడచును
ⓑ ఏలును
ⓒ మరచును
ⓓ త్రోయును
3. చిన్నజ్యోతిని ఏమని పిలుస్తారు?
ⓐ ఉల్క
ⓑ చుక్క
ⓒ చంద్రుడు
ⓓ తార
4. చిన్నజ్యోతి నుండి ఏమి వచ్చును?
ⓐ కిరణము
ⓑ వేడి
ⓒ ఆవిరి
ⓓ వెలుగు
5. చిన్నజ్యోతి ఏమి పోగొట్టును?
ⓐ చీకటిని
ⓑ వేడిని
ⓒభయమును
ⓓ ధూళిని
6. చంద్రుడు ఏమి కలిగి నడచును?
ⓐ మిక్కిలి వేడి
ⓑ మిక్కిలి కాంతి
ⓒ మిక్కిలి చలి
ⓓ మిక్కిలి మంచు
7. చంద్రుడు ఎటువంటి పదార్ధములను పుట్టించును?
ⓐ రుచికరమైన
ⓑ అందమైన
ⓒ శ్రేష్టమైన
ⓓ చక్కనైన
8. యెహోవా తనజనుల దెబ్బలను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల ఎలా ఉండును?
ⓐ కాంతివంతముగా
ⓑ చల్లగా
ⓒ ప్రశాంతముగా
ⓓ సూర్యప్రకాశము వలె
9. చంద్రవంక రూప భూషణములను ధరించినది ఎవరు?
ⓐ సీయోనుకుమార్తెలు
ⓑ తూరు కుమార్తెలు
ⓒ మోయాబురాండ్రు
ⓓ ఎదోముకుమార్తెలు
10. చంద్రబింబమంత అందము కలిగియున్నదెవరు?
ⓐ హదస్సా
ⓑ షూలమ్మితీ
ⓒ తామారు
ⓓ కెరంహప్పు
11. యెహోవాకు ప్రార్ధన చేసి, యెహోషువా ఏ లోయలో చంద్రుని నిలువమనెను?
ⓐ సిద్దీము
ⓑ ఉప్పు
ⓒ అయ్యాలోను
ⓓ గిబియోను
12. సూర్యునితో పాటు చంద్రుడు ఎవరిని స్తుతించెను?
ⓐ యెహోవాను
ⓑ ఆకాశమును
ⓒ పర్వతములను
ⓓ దూతలను
13. యెహోవా మనకు ఎటువంటి వెలుగై యుండెను?
ⓐ మిక్కిలి వింతైన
ⓑ నిత్యమైన
ⓒ వెట్టయైన
ⓓ చల్లనైన
14. మనకు వెలుగిచ్చు చంద్రుడైన దేవుడు ఏమవ్వడు?
ⓐ కృశించడు
ⓑ పాతగిలడు
ⓒ క్షీణింపడు
ⓓ నలుగడు
15. నిత్యము చంద్రునివలె వెలుగిస్తున్న దేవుడు,తన వెలుగును ఏ రూపములో లోకమునకు పంపెను?
ⓐ యేసుక్రీస్తు
ⓑ దూతలు
ⓒ ప్రవక్తల
ⓓ సేవకుల
Result: