1Q. "Travellers" అనగా ఎవరు?
2Q. ఎవరి దినములలో రాజమార్గములు యెడారులు కాగా ప్రయాణస్థులు చుట్టు త్రోవలలోనే నడిచిరి?
3Q. శక్తికి మించిన ప్రయాణము యెహోవా ఎవరికి సిద్ధపరచెను?
4. దేవుని దృష్టికి గొప్పదైన నీనెవె పట్టణము ఎన్ని దినముల ప్రయాణమంత పరిమాణము గలది?
5Q. రాత్రివేళ బసచేయుటకు ఏమి వేయు ప్రయాణస్థుని వలె ఉన్నావని యిర్మీయా యెహోవాతో అనెను?
6Q. తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో అని ఊరక యుండి చూచినది ఎవరు?
7Q. యాకోబు తాను చేసిన యాత్ర సంవత్సరములు ఎన్ని అని ఫరోతో చెప్పెను?
8 Q. యాత్రికుడనై నా బసలో పాటలు పాడుటకు ఏమి నాకు హేతువులాయెనని కీర్తనాకారుడు అనెను?
9Q ఎక్కడ బాటసారుల బస నాకు దొరికిన ఎంతమేలు అని యిర్మీయా యెహోవా వాక్కు ప్రకటించెను?
10 Q. యేసు ఎక్కడకు ప్రయాణమై పోవుచు బోధించుచు సంచారము చేయుచుండెను?
11: ప్రయనము కొరకు జాలె,రెండుఅంగీలు, చెప్పులు, చేతికర్రలనైనను ఏమి చేసుకొనకూడదని యేసు తన శిష్యులతో చెప్పెను?
12: తూరు నుండి ప్రయాణమై పోవుచున్న ఎవరిని ఆ పట్టణమువారు భార్యపిల్లలతో వచ్చి సాగనంపిరి?
13: యూదా, ఇశ్రాయేలు వంశస్థులును ప్రయాణము చేయుచు యెహోవా ఎలా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు?
14Q. తాము భూమిమీద పరదేశులము యాత్రికులమై యున్నామని ఒప్పుకొనిన మన పితరులు ఏమి కలిగి మృతినొందిరి?
15Q. నీతిమంతుల "వెలుగు" తేజరిల్లును ఎవరి దీపము ఆరిపోవును?
Result: