Bible Quiz in Telugu Topic wise: 335 || తెలుగు బైబుల్ క్విజ్ ("చూచి" అనే అంశముపై క్విజ్)

1. దేవుడు దేనిని చూచినప్పుడు అది చెడిపోయి యుండెను?
ⓐ జలరాశిని
ⓑ భూలోకమును
ⓒ ఆహారమును
ⓓ గుడారమును
2. యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములలో లోపము కలుగజేసి యుండుట జనులు "చూచి" ఎవరిగూర్చి పశ్చాత్తాపపడిరి?
ⓐ దీయుల
ⓑ రూబేనీయుల
ⓒ యూదా
ⓓ బెన్యామీనీయుల
3. మొకై వంగకయు నమస్కరింపకయు నుండుట ఎవరు "చూచి" బహుగా కోపగించెను?
ⓐ ఎస్తేరు
ⓑ హామాను
ⓒ అహష్వేరోషు
ⓓ హేగే
4. నిర్దోషులు ఎవరి స్థితి "చూచి" కలవరపడుదురు?
ⓐ అపహాసకుల
ⓑ సోమరుల
ⓒ అసూయ పరుల
ⓓ భక్తిహీనుల
5. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి "చూచి" ఎవరిని పరిశీలించెను?
ⓐ పాపులను
ⓑ దూతలను
ⓒ నరులను
ⓓ ప్రవక్తలను
6. దేవుడు భూలోకమును "చూచి"నప్పుడు అది ఏమైయుండెను?
ⓐ శూన్యమై
ⓑ మంచిదిగా
ⓒ చెడిపోయి
ⓓ ఘోరమై
7. బుద్ధిమంతుడు ఏమి వచ్చుట "చూచి" దాగును?
ⓐ సాతాను శోధన
ⓑ దేవుని రాకడ
ⓒ అపాయము
ⓓ మరణము
8. వ్యభిచారిణిని "చూచి" ఆశించుచు, పాపము మానలేని కన్నులు గలవారు ఏమగుదురు?
ⓐ కోపగ్రస్తులు
ⓑ శాపగ్రస్తులు
ⓒ విచారగ్రస్తులు
ⓓ వ్యాధిగ్రస్తులు
9 . యెహోవా ఎవరిని వినాశము చేయుట "చూచి" దావీదు వ్యాకుల పడెను?
ⓐ ఉజ్జాను
ⓑ ఆసాపును
ⓒ సౌలును
ⓓ హీరామును
10 . నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ, నేను కన్నులార "చూచి"తినని ఎవరు అనెను?
ⓐ ఓబేదెదోము
ⓑ సుమెయోను
ⓒ నెబాయోతు
ⓓ ఇశ్రాయేలు
11. సర్పపుకాటు తినిన ప్రతివాడు దేనిని నిదానించి "చూచి" నందున బ్రదికెను?
ⓐ బంగారు దూడను
ⓑ యిత్తడి సర్పమును
ⓒ అతిక్రమమును
ⓓ బలిపీఠమును
12. పాపము నీ చేతిలోనుండుట "చూచి" నీవు దాని విడిచినయెడల నిశ్చయముగా నీవు ఏమైయుందువు?
ⓐ దోషివై
ⓑ విరోధివై
ⓒ విశ్వాసివై
ⓓ నిర్దోషివై
13. దుష్ప్రక్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట"చూచి" మనుష్యులు దేనిని విడిచి హృదయపూర్వకముగా దుష్ప్రక్రియలు చేయుదురు?
ⓐ లోకమును
ⓑ భయమును
ⓒ పాపమును
ⓓ మోసమును
14. యెహోవా మందిరమందు సొలొమోను అర్పించు దహనబలులను "చూచి"నప్పుడు, ఎవరు విస్మయమొందెను?
ⓐ షేబదేశపు రాణి
ⓑ హదదు
ⓒ ఫరో
ⓓ హీరాము
15. ప్రభువు దయాళుడని మీరు రుచి "చూచి" యున్న యెడల మీరు వేటిని మానెదరు?
ⓐ సమస్తమైన దుష్టత్వమును
ⓑ సమస్తమైన కపటమును
ⓒ సమస్తదూషణ మాటలను
ⓓ పైవన్నియును
Result: