1. ఇశ్రాయేలీయులు కప్పుకొను బట్ట నాలుగు "చెంగులకు"ఏమి చేసుకొనవలెనని యెహోవా సెలవిచ్చెను?
2. సౌలు ఎవరి దుప్పటి "చెంగును" పట్టుకొనినందున అది చినిగెను?
3. ఏమియైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట "చెంగుల"మీద కనబడుచున్నదని యెహోవా ఇశ్రాయేలు వారితో అనెను?
4. దేని యొక్క అపవిత్రత దాని "చెంగుల" మీద నున్నదని యెహోవా అనెను?
5. ఎవరి తలవెండ్రుకలలో కొన్నిటిని "చెంగున" కట్టుకొనుమని యెహోవా అతనితో చెప్పెను?
6. నీ "చెంగులు" నీ ముఖముమీది కెత్తి నీ మానమును బయలుపరతునని యెహోవా దేని గురించి చెప్పెను?
7. ఒకడు ప్రతిష్టితమైన మాంసమును తన వస్త్రపు "చెంగుకు"కట్టుకొని దేనినైన ముట్టిన ఆది ప్రతిష్టితమగునా?అని యెహోవా ఎవరిని అడిగెను?
8. దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి వినబడినది గనుక మీతో వత్తుమని ఎవరు యొక యూదుని "చెంగు"పట్టుకొని చెప్పుదురు?
9. ఏ రోగము గల స్త్రీ యేసు యొక్క వస్త్రపు "చెంగు" ముట్టగానే ఆమెకు స్వస్థత కలిగెను?
10. యేసు ఏ దేశమునకు రాగా అక్కడి జనులు ఆ ప్రదేశములోని రోగులందరిని తెప్పించి ఆయన వస్త్రపు "చెంగు"ముట్టనిమ్మని వేడుకొనిరి?
11. శాస్త్రులు పరిసయ్యులు తమ "చెంగులు" పెద్దవిగాను చేసుకొని ఎటువంటి భారమైన బరువులు కట్టి మనుష్యుల మీద పెట్టుదురు?
12. నాలుగు "చెంగులు"పట్టి దింపబడిన యొక విధమైన పాత్ర భూమి మీదికి దిగి వచ్చుట ఎవరు దర్శనములో చూచెను?
13. దుప్పటి వంటి యొక విధమైన నాలుగు "చెంగుల"పాత్రలో సకలవిధములైన ఏమి యుండెను?
14. స్త్రీకి తలవెండ్రుకలు పైట "చెంగుగా"ఇయ్యబడెను గనుక వాటిని పెంచుకొనుట ఆమెకు ఏమై యున్నది?
15. "చెంగు"ఆత్మీయముగా దేనికి సూచనగా నుండెను?
Result: