Bible Quiz in Telugu Topic wise: 338 || తెలుగు బైబుల్ క్విజ్ ("చెడుతనము " అనే అంశముపై క్విజ్-1)

1. జనులు చెడుతనమును ఏమి చేసుకొనుచున్నారు?
ⓐ ఆధారము
ⓑ స్వంతము
ⓒ ఆసరా
ⓓ భరోసా
2. నరుల యొక్క ఏది చెడుతనముతో నిండియున్నది?
ⓐ నివాసము
ⓑ గృహము
ⓒ మనస్సు
ⓓ హృదయము
3. ఎప్పటి నుండి యెహోవా యెదుట చెడుతనము చేయుచు వచ్చితిమి?
ⓐ యౌవనము
ⓑ పుట్టిననాటి
ⓒ బాల్యము
ⓓ నడివయస్సు
4. తన పూర్వీకులందరి కంటే యెహోవా దృష్టికి చెడుతనము చేసిన రాజెవరు?
ⓐ జెకర్యా
ⓑ యెహూ
ⓒ అమాజ్యా
ⓓ ఆహాబు
5. ఏది జలమును ఉబుక చేయునట్లు జనులు తమ చెడుతనమును ఉబుకజేయును?
ⓐ ఊట
ⓑ చెరువు
ⓒ నది
ⓓ తటాకము
6. చెడుతనము చేసిన ఏమి నొంది సిగ్గుపడుదురు?
ⓐ నింద
ⓑ నేరము
ⓒ అవమానము
ⓓ భయము
7 . చెడుతనము విడిచుట ఎవరికి అసహ్యము?
ⓐ దొంగలకు
ⓑ ద్రోహులకు
ⓒ పాపులకు
ⓓ మూర్ఖులకు
8 . యెహోవా దృష్టి యెదుట చెడుతనము చేసియున్నానని ఒప్పుకొనినది ఎవరు?
ⓐ ఆసాపు
ⓑ సొలొమోను
ⓒ దావీదు
ⓓ ఏతాను
9 . చెడుతనము చేయుట వలన జనుల మీదికి ఏమి వచ్చును?
ⓐ భయము
ⓑ కీడు
ⓒ అపాయము
ⓓ ఆపద
10 . దోషులని నిర్దోషులకు మరణము విధించువారి చెడుతనమును బట్టి యెహోవా వారిని ఏమి చేయును?
ⓐ విడుచును
ⓑ త్యజించును
ⓒ శిక్షించును
ⓓ సంహరించును
11. చెడుతనమునకు యెహోవా యొద్ద ఏమి లేదు?
ⓐ స్థలము
ⓑ తావు
ⓒ చోటు
ⓓ నివాసము
12 . ఎవరి యొక్క చెడుతనమును యెహోవా మాన్పించును?
ⓐ జనుల
ⓑ దుష్టుల
ⓒ చెడ్డవారి
ⓓ పాలకుల
13 . యెహోవాను ప్రేమించువారు చెడుతనమును ఏమి చేయుదురు?
ⓐ విడుచుదురు
ⓑ త్రోసివేయుదురు
ⓒ అసహ్యించుకొందురు
ⓓ విసర్జింతురు
14 . యెహోవా యందు ఏమి కలిగి యుండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలిగిపోవుదురు?
ⓐ వినయము
ⓑ విధేయత
ⓒ నమ్మకము
ⓓ భయభక్తులు
15 . చెడుతనము విడిచి నడచుట ఎవరికి రాజమార్గము?
ⓐ యధార్దవంతులకు
ⓑ దీనులకు
ⓒ మంచివారికి
ⓓ చెడ్డవారికి
Result: