Bible Quiz in Telugu Topic wise: 339 || తెలుగు బైబుల్ క్విజ్ ("చెడుతనము" అనే అంశముపై క్విజ్-2)

1. నరుల యొక్క ఏది చెడుతనముతో నిండియున్నది?
ⓐ గృహము
ⓑ బ్రతుకు
ⓒ మనస్సు
ⓓ హృదయము
2. యెహోవా మందిరములో ఎవరి చెడుతనము యెహోవాకు కనబడెను?
ⓐ జనుల, పెద్దల
ⓑ పరదేశుల, ప్రధానుల
ⓒ ప్రవక్తలు, యాజకుల
ⓓ మిశ్రిత జనముల
3 . చెడుతనము విడచుట ఎవరికి అసహ్యము?
ⓐ ద్రోహులకు
ⓑ మూర్ఖులకు
ⓒ భక్తిహీనులకు
ⓓ అవివేకులకు
4 . చెడుతనమను పంటను దున్నువారు ఏమను కోత కోసెదరు?
ⓐ దోషము
ⓑ అతిక్రమము
ⓒ పాపము
ⓓ క్రూరము
5 . ఎవరి నోటికి చెడుతనము తియ్యగా నుండెను?
ⓐ దుర్మార్గులకు
ⓑ కపటులు,ద్రోహులకు
ⓒ గర్వాంధులు, ధనాపేక్షులకు
ⓓ దుష్టులు, భక్తిహీనులకు
6 . నరుల చెడుతనము భూమి మీద ఎటువంటిది?
ⓐ చెడ్డది
ⓑ గొప్పది
ⓒ అసహ్యమైనది
ⓓ చూడనొల్లనిది
7 . చెడుతనము మానుకొని మారుమనస్సు పొందమని ఎవరు గారడీ సీమోనుతో అనెను?
ⓐ యాకోబు
ⓑ ఫిలిప్పు
ⓒ యోహాను
ⓓ పేతురు
8 . చెడుతనము విడిచి నడుచుటయే యధార్దవంతులకు ఏమై యున్నది?
ⓐ రాజమార్గము
ⓑ మంచిమార్గము
ⓒ ఉన్నత మార్గము
ⓓ శ్రేష్టమార్గము
9 . తమ చెడుతనమును బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు ఏమి పుట్టించిరి?
ⓐ అసహ్యము
ⓑ కోపము
ⓒ ఆగ్రహము
ⓓ ఏహ్యము
10 . నీ చెడుతనము నిన్ను ఏమి చేయునని యెహోవా అనెను?
ⓐ బాధించును
ⓑ విసర్జించును
ⓒ శిక్షించును
ⓓ త్రోసివేయును
11 . ఏది తన జలమును పైకి ఉబుక చేయునట్లు యెరూషలేము తన చెడుతనమును ఉబుకజేయుచున్నది?
ⓐ బావి
ⓑ ఊబి
ⓒ తటాకము
ⓓ ఊట
12 . ఏమియై చెడుతనము చేయకుండవలెను?
ⓐ భయపడి
ⓑ దిగులుపడి
ⓒ జాగ్రత్తపడి
ⓓ వెరువపడి
13 . చెడుతనమునకు యెహోవా యొద్ద ఏమి లేదు?
ⓐ తావు
ⓑ స్థలము
ⓒ జాగా
ⓓ చోటు
14 . ఎప్పుడు మొదలుకొని జనులు చెడుతనమే చేయుచు వచ్చిరి?
ⓐ పుట్టినది
ⓑ బాల్యము
ⓒ యౌవనము
ⓓ చిన్నతనము
15 . యెహోవా యందు ఏమి కలిగి యుండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలిగిపోవుదురు?
ⓐ వినయము
ⓑ విధేయత
ⓒ నమ్మకము
ⓓ భయభక్తులు
Result: