Bible Quiz in Telugu Topic wise: 34 || తెలుగు బైబుల్ క్విజ్ ("Day of Widow" సందర్భంగా బైబిల్ క్విజ్)

1. ఎవరిని విధవరాలు అని పిలుచుదురు?
ⓐ భర్త విడిచిన స్త్రీ
ⓑ భర్తను విడిచిన స్త్రీ
ⓒ భర్త చనిపోయిన స్త్రీ
ⓓ జారస్త్రీ
2. విధవరాండ్రు ఎవరిని ఆశ్రయించవలెను?
ⓐ యెహోవాను
ⓑ తండ్రిని
ⓒ మామను
ⓓ అధికారులను
3 . యెహోవా విధవరాండ్రకు ఏమియై యుండెను?
ⓐ న్యాయకర్తయై
ⓑ శాసనకర్తయై
ⓒ బోధనకర్తయై
ⓓ తీర్పరియై
4 . విధవరాలి పొలిమేరను యెహోవా ఏమి చేయును?
ⓐ నిర్మించును
ⓑ కట్టును
ⓒ కాయును
ⓓ స్థాపించును
5 . ఎవరు విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టెను?
ⓐ సొలొమోను
ⓑ ఉజ్జీయా
ⓒ యోబు
ⓓ ఆసా
6. విధవరాలి పక్షమున ఏమి చేయవలెను?
ⓐ మాట్లాడవలెను
ⓑ నిలువవలెను
ⓒ వాదించవలెను
ⓓ వ్యాకులపడవలెను
7 . విధవరాలికి న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు ఏమగును?
ⓐ శాపగ్రస్తుడు
ⓑ ద్రోహి
ⓒ పాడగును
ⓓ దుర్మార్గుడు
8 . విధవరాలి వస్త్రమును ఎలా తీసుకొనకూడదు?
ⓐ బదులుగా
ⓑ అప్పుగా
ⓒ బలవంతముగా
ⓓ తాకట్టుగా
9 . నిజముగా అనాధలైన విధవరాండ్రను ఏమి చేయాలి?
ⓐ ఆదరించవలెను
ⓑ పోషించవలెను
ⓒ సన్మానించవలెను
ⓓ సహకరించవలెను
10 . యెనుబది నాలుగు సంవత్సరముల నుండి విధవరాలుగా యున్న ఎవరు ఉపవాస ప్రార్ధనలతో దేవుని సేవించుచుండెను?
ⓐ నయోమి
ⓑ అన్న
ⓒ జిబ్యా
ⓓ సెరూయా
11. సీదోనులోని సారెపతు ఊరిలో నున్న విధవరాలి యొద్దకు పంపబడిన ప్రవక్త ఎవరు?
ⓐ ఎలీషా
ⓑ అహీయా
ⓒ హనానీ
ⓓ ఏలీయా
12 . ఏ ఊరికి వెళ్ళుచున్నప్పుడు యేసు, చనిపోయిన విధవరాలి కుమారుని బ్రదికించెను?
ⓐ గలిలయ
ⓑ కపెర్నహూము
ⓒ నాయీను
ⓓ యెరూషలేము
13 . విధవరాలైన తన శిష్యుని భార్య మొర్ర విని ఆమెకు సహాయము చేసినదెవరు?
ⓐ గాదు
ⓑ యెహు
ⓒ యిర్మీయా
ⓓ ఎలీషా
14 . ఒక బీద విధవరాలు కానుక పెట్టెలో వేసిన ఏమి చూచి యేసు,ఆమె అందరి కంటే ఎక్కువ వేసెననెను?
ⓐ వందకాసులు
ⓑ వేయికాసులు
ⓒ వెండికాసులు
ⓓ రెండుకాసులు
15 . విధవరాలు వేటి యందు పేరు పొందవలెను?
ⓐ ఉపకారముల
ⓑ సహాయము
ⓒ సత్ క్రియల
ⓓ ఉపచారము
Result: