Bible Quiz in Telugu Topic wise: 343 || తెలుగు బైబుల్ క్విజ్ ("చెవులు" అను అంశముపై క్విజ్-2)

1. ఎటువంటి "చెవిని" యెహోవా కలుగజేసెను?
ⓐ మంచిదైన
ⓑ అందమైన
ⓒ శుద్ధియైన
ⓓ వినగల
2. జరిగినదంతయు నా "చెవి"గ్రహించియున్నదని ఎవరు అనెను?
ⓐ యాకోబు
ⓑ ఆమోసు
ⓒ యోబు
ⓓ మలాకీ
3. ఎవని "చెవులలో" బాధాకరమైన ధ్వనులు పడును?
ⓐ అవివేకి
ⓑ దుష్టుని
ⓒ చోరుని
ⓓ దుర్మార్గుని
4. దేని వలన నశింపకుండా నరుని ప్రాణము తప్పించియెహోవా వారి "చెవులను"తెరువచేసెను?
ⓐ కత్తి
ⓑ ఖడ్గము
ⓒ ఈటె
ⓓ బాణము
5. దహనబలులను నైవేద్యములను యెహోవా కోరుకొనలేదు గాని, నాకు "చెవులు" నిర్మించెనని ఎవరు అనెను?
ⓐ మోషే
ⓑ దావీదు
ⓒ నాతాను
ⓓ ఆసాపు
6. ఎవరి విగ్రహములు "చెవులుండియు" వినవు?
ⓐ ఐగుప్తీయుల
ⓑ కనానీయుల
ⓒ అన్యజనుల
ⓓ ఫిలిష్తీయుల
7. ఎవరి మొరవినక "చెవి"మూసుకొనువాడు తాను మొర్రపెట్టునపుడు అంగీకరింపబడడు?
ⓐ బీదలు
ⓑ నిరాశ్రయులు
ⓒ దిక్కులేనివారు
ⓓ దరిద్రులు
8. యెహోవా దినమున చెవిటి వారి "చెవులు" ఏమగును?
ⓐ తెరువబడును
ⓑ వినబడును
ⓒ విప్పబడును
ⓓ శుద్ధియగును
9. ఎవరు చేసిన కలహము తన "చెవులలో॥ జొచ్చెనని యెహోవా అనెను?
ⓐ ఐగుప్తుకుమారి
ⓑ సీయోనుకుమారి
ⓒ తూరుకుమారి
ⓓ మోయాబుకుమారి
10. చెవులుండి ఏమైన వారిని తీసుకొని రమ్మని యెహోవా సెలవిచ్చెను?
ⓐ బధిరులైన
ⓑ విననివారిని
ⓒ యొగ్గనివారిని
ⓓ మూసుకొనినవారిని
11. "చెవులుండి"వినకయు నున్న ఏమి లేని మూడులని యెహోవా యాకోబు యూదా వంశస్థులను అనెను?
ⓐ జ్ఞానము
ⓑ వివేకము
ⓒ తెలివి
ⓓ బుద్ధి
12. ఎక్కడ యెహోవా చేయు కార్యము వినిన వారి "చెవులు" గింగురుమనును?
ⓐ సొదొమలో
ⓑ ఎదోములో
ⓒ ఇశ్రాయేలులో
ⓓ బబులోనులో
13. శత్రువులు ఎవరి "చెవులు" తెగకోయుదురని యెహోవా సెలవిచ్చెను?
ⓐ యెజెబెలు
ⓑ అతల్యా
ⓒ ఒహొలా
ⓓ ఒహోలీబా
14. ఎవరితో యిర్మీయా నేను నీ "చెవులలోను, నీ ప్రజల "చెవులలోను చెప్పుచున్న మాటను చిత్తగించి వినుమనెను?
ⓐ హనన్యాతో
ⓑ హదదుతో
ⓒ సిద్కియాతో
ⓓ బారూకుతో
15. యెహోవా కనుపరచు వేటిని చూచిన అన్యజనుల "చెవులు"చెవుడెక్కి పోవును?
ⓐ ఉన్నతక్రియలు
ⓑ అద్భుతములు
ⓒ మహాకార్యములు
ⓓ గొప్పపనులు
Result: