1. ఎవరు పవిత్రమైన "చేతులెత్తి" ప్రార్ధన చేయవలెను?
2. ఎవరు తన "చేతులు"పైకెత్తి ఇశ్రాయేలీయులు విజయము పొందువరకు నిలకడగా యుంచెను?
3. యెహోవా ఎవరి మీద కనికరపడుట వలన దూతలు అతనిని అతని కుటుంబము వారి "చేతులు"పట్టుకొని వెలుపలికి తెచ్చిరి?
4. జనుల "చేతులు"దేని చేత అపవిత్రపరచబడియున్నవి?
5. నన్ను ప్రేమించినవారి ఇంట నా "చేతులకు"గాయములైనవని ఏమి చెప్పిన వారు అనెను?
6. ఏమి గల స్త్రీలు తమ "చేతులతో" నూలును వడికిరి?
7. గుణవతి యైన స్త్రీ తన "చేతులతో" ఎలా పనిచేయును?
8. యెహోవా మనలను కాపాడుటకు ఎవరికి ఆజ్ఞాపించగా వారు తమ "చేతుల" మీద ఎత్తి పట్టుకొందురు?
9. ఏ ప్రజలవైపు దినమంతయు నా "చేతులు చాపుచున్నానని యెహోవా అనెను?
10. యెహోవా యొక్క దేని వైపు "చేతుల" నెత్తినప్పుడు ఆయన విజ్ఞాపనముల ధ్వని ఆలకించును?
11. ఏది చిన్నపిల్లల వారిదని యేసు చెప్పి వారి మీద తన "చేతులుంచెను"?
12. ఆహారము పంచిపెట్టుటకు ఏర్పర్చబడిన ఎంతమంది మీద అపొస్తలులు తమ "చేతులుంచిరి"?
13. అపొస్తలులు "చేతులుంచుట వలన పరిశుధ్ధాత్మ అనుగ్రహింపబడెనని ఎవరు చూచెను?
14. యెహోవా వైపు "చేతులెత్తుట" సాయంకాలపు దేనివలె యుండును?
15. యెహోవా తన యర "చేతుల"మీద మనలనేమి చేసియుండెను?
Result: