① చేపలను "దేవుడు ఎన్నవ దినమున కలుగజేసెను?
2 యెహోవా ఆజ్ఞాపించినట్లు ఎవరు ఐగుప్తు ఏటిపాయలు మీద కొట్టగా నీరు రక్తముగా మారి ఏటి "చేపలు కంపుకొట్టెను?
③. ఐగుప్తులో మేము ఎలా తినిన "చేపలు"జ్ఞాపకమునకు వచ్చుచున్నాయని ఇశ్రాయేలీయులు ఏడ్చిరి?
④. నదులను ఎలా చేయుట వలన నీళ్లలోని "చేపలు"కంపుకొట్టుచున్నవని యెహోవా సెలవిచ్చెను?
⑤. విశ్రాంతిదినములలో ఎవరు యూదులకు "చేపలు"అమ్ముచున్నారని నెహెమ్యా అనెను?
⑥. మందిరపు గడపక్రింద నుండి ప్రవహించే నీరు దేనిలో పడి ఆవిమంచినీరుగా మారి అక్కడ"చేపలు"బహువిస్తారమగును?
⑦. ఏలికలేని "చేపలతో"నరులను సమానముగా చేసితివని ఎవరు యెహోవాతో అనెను?
⑧. "చేపలు" ఎటువంటి వలయందు చిక్కుబడునట్లు నరులు తమ చేటు కాలమున చిక్కుబడుదురు?
9. ఎక్కడ ఉన్నట్లుగా దేవుని నది నీరు పడిన ఆరాబాసముద్రములో సకలజాతి "చేపలు"ఉండును?
①⓪. యేసు చెప్పిన మాటను బట్టి సీమోను వల వేయగా ఏవి మునుగునంత విస్తారమైన "చేపలు"పడెను?
①①. యేసు రెండు "చేపలను"ఆశీర్వదించి జనసమూహమునకు ఆహారము పెట్టగా ఎంతమంది పురుషులు తినిరి?
①②. యేసు సిలువ వేయబడిన తర్వాత ఎవరెవరు "చేపలు"పట్టుటకు పోయిరి?
①③. యేసు కుడిప్రక్కను వల వేయమనగా రాత్రి చేపలు పట్టలేని శిష్యులుఎన్ని గొప్ప "చేపలు"పట్టిరి?
①④. యేసు "చేపలు"పట్టు జాలరులైన పేతురు అంద్రెయలను ఎవరిని పట్టు జాలరులుగా చేసెదననెను?
①⑤. ఏది సముద్రములో వేయబడి నానావిధములైన "చేపలను"పట్టు వలను పోలియున్నది?
Result: