1Q. దేవుడు సృష్టించిన ప్రతి భూజంతువుకు ప్రతి ఆకాశపక్షికి ఎవరు పేరులు పెట్టెను?
2 . జంతువులను, పక్షులను, జలచరములను దేవుడు ఎలా విభాగించెను?
3Q. దేవుడు తన గదిలో నుండి కొండలకు జలధారలనిచ్చి వేటి దప్పిక తీర్చును?
4Q. మహాసముద్రములో గాలమువేసి పట్టుకోలేని ఏ జలచరమును దేవుడు సృష్టించెను?
5 Q. బిలాముతో మాట్లాడునట్లు దేవుడు దేనికి వాక్కు నిచ్చెను?
6Q. వేసవిలో ఆహారమును సిద్ధపరచుకొనే బలములేని జీవులైన వేటి యొద్దకు సోమరిని వెళ్ళమని దేవుడు చెప్పెను?
7:యెహోవా బలిపీఠము యొద్ద వేటికి నివాసము దొరికెను?
8Q. తన గుడ్లను కాపాడుకోలేని తెలివితక్కువ పక్షిగా దేవుడు దేనిని చేసెను?
9 Q. గొప్ప కొండలను వేటికి ఉనికిపట్లుగా చేసి,బండలలో వేటికి దేవుడు ఆశ్రయస్థానమిచ్చెను?
10 Q. యెహోవా ఆజ్ఞవలన తన రెక్కలను దక్షిణదిక్కుకు చాచుకొనే జ్ఞానము పొందినది ఎవరు?
11:ఏ పక్షి రెక్కలు చాపుకొని ఆకాశవీధిలో తన పిల్లలను మోయునట్లు "యెహోవా"తన ప్రజలను నడిపించెను?
12 Q ఆకాశపక్షులను పోషించే పరమతండ్రి వాటికంటే మనము ఎవరని అనుచున్నాడు?
13. ప్రియురాలైన సంఘము నేత్రములను ప్రియుడైన "యేసు" వేటితో పోల్చుచున్నాడు?
14Q. యేసుక్రీస్తు బాప్తిస్మము పొందినపుడు "ఆత్మ" ఏ రూపమున దిగి ఆయనమీదికి వచ్చెను?
15. లోకపాపమును మోసికొని పోవు దేవుని "గొర్రెపిల్ల"ఎవరు?
Result: