1. కోరెషు ఏ దేశమునకు రాజు?
2 . ఏ ప్రవక్త ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేరుటకై యెహోవా కోరెషు మనస్సును ప్రేరేపించెను?
3 . ఆకాశమందలి దేవుడైన యెహోవా ఎవరిని కోరెషు వశము చేసెను?
4 . తన ఏలుబడిలో ఎన్నవ సంవత్సరమున యెహోవా మందిరము కట్టుటకు కోరెషు చాటింపు వేయించెను?
5 . యెహోవా తన మందిరమును ఎక్కడ కట్టుమని కోరెషునకు ఆజ్ఞాపించెను?
6 . కోరెషు వేయించిన చాటింపు విని ఎవరు యెహోవా మందిరము కట్టుటకు కూడివచ్చిరి?
7. కోరెషు గురించి ఏ ప్రవక్త ద్వారా యెహోవా వ్రాయించెను?
8 . దేనిని బట్టి దేవుడు కోరెషును రేపితిననెను?
9 . కోరెషు మార్గములన్నియు యెహోవా ఏమి చేసెను?
10 . కోరెషు తన పట్టణమును ఏమి చేయునని యెహోవా చెప్పెను?
11 . ఎవరు తన దేవతల గుడియందుంచిన యెహోవా మందిరము ఉపకరణములను కోరెషు తెప్పించెను?
12 . తన ఖజానాదారుడైన ఎవరి చేత కోరెషు యెహోవా మందిరము ఉపకరణములను లెక్కవేయించెను?
13 . యెహోవా మందిరము ఉపకరణములను కోరెషు యూదులకు అధిపతియగు ఎవరికి ఆప్పగించెను?
14 . కోరెషు ఏమి తీసుకొనడు,ఏమి పుచ్చుకొనడని యెహోవా చెప్పెను?
15 . కోరెషు ఎవరిని విడిపించునని యెహోవా చెప్పెను?
Result: