①. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు "జయము" అనుగ్రహించుచున్న దేవునికి ఏమి కలుగును గాక?
②. నీతిమంతులకు "జయము" కలుగుట దేనికి కారణము?
③. దేవుని మూలముగా పుట్టిన వారందరు దేనిని "జయించు"దురు?
④. కీడును దేనిచేత "జయించ"వలెను?
⑤. దూతతో పోరాడి ఎవరు "జయమొందెను"?
⑥. యెహోవా ఎవరికి తోడుగా ఉండెను గనుక అతడు తాను వెళ్లిన చోటనెల్ల "జయము" పొందెను?
⑦. ఎవరి చేత యెహోవా సిరియా దేశమునకు "జయము" కలుగజేసియుండెను?
⑧. 'దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము' ఎన్ని ముద్రలను తీసి గ్రంథమును విప్పుటకై "జయము" పొందెను?
⑨. ఎవరు తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించి "జయమొందిరి"?
①⓪. "జయించు"వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును' అని ఏ సంఘమును గూర్చి వ్రాయబడెను?
①①. "జయించు"వాడు ఎన్నవ మరణము వలన ఏ హానియుచెందడు
①②. "జయించు"వాడు దేవుని పరదైసులో ఉన్న వేటిని భుజించును?
①③. 'మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు "జయము" నొందరు' అను మాట యూదా రాజైన సిద్కియాకు ఎవరు ప్రకటించెను?
①④. దావీదు కుమారునికి "జయము" అని దేవాలయములో ఎవరు కేకలు వేయుచుండెను?
①⑤. "జయించు" వాడు దేవుని ఆలయములో దేనిగా ఉండును?
Result: