1Q. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు "జయము" అనుగ్రహించుచున్న దేవునికి ఏమి కలుగును గాక?
2 Q. నీతిమంతులకు "జయము" కలుగుట దేనికి కారణము?
3 Q. దేవుని మూలముగా పుట్టిన వారందరు దేనిని "జయించు"దురు?
4. కీడును దేనిచేత "జయించ"వలెను?
5Q. దూతతో పోరాడి ఎవరు "జయమొందెను"?
6 Q. యెహోవా ఎవరికి తోడుగా ఉండెను గనుక అతడు తాను వెళ్లిన చోటనెల్ల "జయము" పొందెను?
7. ఎవరి చేత యెహోవా సిరియా దేశమునకు "జయము" కలుగజేసియుండెను?
8 Q. 'దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము' ఎన్ని ముద్రలను తీసి గ్రంథమును విప్పుటకై "జయము" పొందెను?
9 Q. ఎవరు తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించి "జయమొందిరి"?
10 Q. "జయించు"వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును' అని ఏ సంఘమును గూర్చి వ్రాయబడెను?
11.జయించువాడు ఎన్నవ మరణము వలన ఏ హానియుచెందడు?
12Q. "జయించు"వాడు దేవుని పరదైసులో ఉన్న వేటిని భుజించును?
13Q. 'మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు "జయము" నొందరు' అను మాట యూదా రాజైన సిద్కియాకు ఎవరు ప్రకటించెను?
14.దావీదు కుమారునికి "జయము" అని దేవాలయములో ఎవరు కేకలు వేయుచుండెను?
15."జయించు" వాడు దేవుని ఆలయములో దేనిగా ఉండును?
Result: