Bible Quiz in Telugu Topic wise: 354 || తెలుగు బైబుల్ క్విజ్ (జాగ్రత అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ -2)

1Q. "జాగ్రత్త" అనగా నేమి?
A సంరక్షణ
B హెచ్చరిక
C భాధ్యత
D పైవన్నీ
2. "జాగ్రత్త" అను పదము బైబిల్ నందు ఎన్నిసార్లు కలదు?
A తొంభైరెండు
B డెబ్బది మూడు
C ఎనుబది మూడు
D అరువది ఆరు
3Q. దేవుని మందిరమునకు వెళ్ళునప్పుడు దేనిని "జాగ్రత్తగా" చూచుకోవాలి?
A ప్రవర్తనను
B అలంకారమును
C వస్త్రములను
D చూపులను
4. యెహోవా ఇచ్చిన వేటిని చేయుటకు "జాగ్రత్త" పడవలెను?
A పనులను
B భారములను
C ఆజ్ఞలను
D ఈవులను
5 Q. అవిధేయత వలన పడిపోకుండా ఎక్కడకు ప్రవేశించుటకు "జాగ్రత్త"పడాలి?
A మందిరమునకు
B విశ్రాంతికి
C సమాజమునకు
D గృహములోనికి
6Q. కన్నులారా చూచిన వేటిని మరువకుండా "జాగ్రత్తగా"ఉండాలి?
A దేవుని అద్భుతములను
B యెహోవాగొప్ప కార్యములను
C దేవుని ఆశ్చర్యకార్యములను
D పైవన్నీ
7. ఎప్పటి వరకు దేవుని క్రియలను చేయుటకు "జాగ్రత్త"పడవలెను.
A సంవత్సరము వరకు
B ఒక మాసమువరకు
C ఆరోగ్యమున్నంతవరకు
D అంతము వరకు
8 Q. దేవుని ధర్మశాస్త్రవిధులు, కట్టడలు ఎక్కడనుండి తొలిగిపోకుండా,దేనిని "జాగ్రత్తగా" కాపాడుకోవాలి?
A హృదయము - మనస్సు
B ఆలోచనలు - కన్నులు
C తలంపులు - చెవులు
D మనస్సు - నోరు
9Q. దేవుని దృష్టికి ఎలా కనబడుటకు "జాగ్రత్త"పడాలి?
A నిష్కళంకులుగా
B నిందారహితులుగా
C పై రెండూ
D పైవేమీ కాదు
10 Q. ఎవరి వలె వారి దేవతలను కొలిచినట్లు చేసెదము అని అనుకోకుండా "జాగ్రత్త"పడవలెను?
A అన్యజనుల
B లోకములోని వారి
C ఇతర జనముల వలె
D పైవన్నీ
11: జాగ్రత్త పడి ఏమి మానుకోవాలి?
A ఉపకారము
B చెడుతనము
C అపకారము
D మర్యాదను
12Q. ఏ సంవత్సరమున చెడ్డతలంపులు పుట్టకుండునట్లు "జాగ్రత్త"పడవలెను?
A మొదటి
B చివరి
C విడుదల
D క్రయము చేయు
13. జాగ్రత్త సుమా", మంచిగాని, చెడ్డగాని ఎవరితో మాట్లాడవద్దని దేవుడు లాబానుతో చెప్పెను?
A ఏశావు
B లేయా
C రాహేలు
D యాకోబు
14. ఇతరుల యందు "జాగ్రత్త" చూపుట యందు మన ప్రేమ ఎలా యుండాలి?
A మంచిగా
B కపటముగా
C యధార్ధముగా
D నిలకడగా
15Q. పరిసయ్యుల ఏమి అను పులిసిన పిండిన గూర్చి "జాగ్రత్త"పడాలి?
A ఆచరణ
B ఆచారాలు
C వ్యవహారము
D వేషధారణ
Result: