1. విశ్వాసములేని ఏది ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని "జాగ్రత్త"గా చూచుకొనవలెను?
2. దేనికొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో "జాగ్రత్త" గలవారై యుండవలెను?
3. ఇక కొంతకాలమునకు ఎవరి స్థలమును "జాగ్రత్త"గా పరిశీలించినను వారు కనబడకపోవుదురు?
4. దేవుడు - అంతమువరకు నా క్రియలు "జాగ్రత్త"గా చేయువానికి ఎవరిమీద అధికారము ఇచ్చెదను?
5. కీడుచేయుట మాని, మేలుచేయ నేర్చుకొని దేనిని"జాగ్రత్త"గా విచారించవలెను?
6. నీవు "జాగ్రత్త"పడునట్లు దివారాత్రము ధర్మశాస్త్రమును ధ్యానించినయెడల దేనిని వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు?
7. నీ దేవుడైన యెహోవా మాటను "జాగ్రత్త"గా వినినయెడల మీలో ఎవరు ఉండనే ఉండరు?
8. యెహోవా దూత ఎవరికి ప్రత్యక్షమై నీవు "జాగ్రత్త"గా ఉండి, ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము అని ఆజ్ఞాపించెను?
9. నేను వచ్చువరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును "జాగ్రత్త"గా ఉండుమని పౌలు ఎవరిని హెచ్చరించెను?
10. "నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును" వాక్యము యొక్క రిఫరెన్స్ తెలుపండి?
11. నీవు నిబ్బరముగలిగి "జాగ్రత్త" పడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెనని దేవుడు ఎవరికి ఆజ్ఞాపించెను?
12. మోసకరమైన దేనిచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమోనని "జాగ్రత్తగా" ఉండుడి?
13. అబద్ద ప్రవక్తలను గూర్చి "జాగ్రత్త"పడుడి, వారు గొట్టెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు_____________ ?
14. యౌవనస్థులు దేనిని "జాగ్రత్త"గా చూచుకొనుట చేతనే తమ నడత శుద్ధిపరచు కొందురు?
15. అజ్ఞానులవలె కాక, ఎవరివలె నడుచుకొనునట్లు "జాగ్రత్త"గా చూచుకొనుడి?
Result: