1. పనివారు కష్టము సంపాదించుకొనిన "జీతము"ఎక్కడ వేసినట్టుగా ఉన్నది?
2. ఏది విగ్రహములను వేశ్యయై సంపాదించుకొనిన "జీతము"పెట్టి కొనుక్కొనెను?
3. ఎవరు నా విటకాండ్రు నాకిచ్చిన "జీతము"అని ద్రాక్షా అంజూరపు చెట్లు గురించి చెప్పినది అని యెహోవా అనెను?
4. నీ యేర్పాటు చొప్పున నీ సేవకుల "జీతము" నీకిచ్చెదనని సొలొమోను ఎవరితో అనెను?
5. ఎవరు నాకు "జీతము ఇచ్చుచున్నాడు,నేను అతనికి యాజకుడనై యున్నానని లేవీయుడు దానీయులతో అనెను?
6. నీ దాసుడు ఎంత కాలము దాస్యము చేసినందుకు జీతగానికి రావలసిన రెండు "జీతముల"లాభము నీకు కలిగెనని ఇశ్రాయేలీయులతో యెహోవా చెప్పెను?
7. ఏమి తప్పి తన మేడగదులు కట్టించుకొనుచు "జీతము"ఇయ్యక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ?
8. ఎవరు ముప్పదిరెండువేల రధములతో వచ్చునట్లు "జీతము"ఇచ్చి మయకా రాజును అతని జనులను కుదుర్చుకొనిరి?
9. వేశ్య "జీతముగా" ఉన్న దేని వర్తకలాభము యెహోవాకు ప్రతిష్టితమగును?
10. యెహోవా తాను ఇచ్చు "జీతము"తీసుకొని వచ్చుచున్నాడని ఎవరికి ఆయన తెలియజేయమనెను?
11. పనివానికి "జీతము"ఋణమే గాని దానమని యెంచబడదని ఎవరు అనెను?
12. ప్రతివాడు తాను చేయు దేని కొలది "జీతము"పుచ్చుకొనును?
13. సువార్తను ఎలా ప్రకటించుటయే నా "జీతము"అని పౌలు అనెను?
14. మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘముల వలన "జీతము"పుచ్చుకొంటినని పౌలు ఏ సంఘముతో అనెను?
15. వానివాని యొక్క దేని చొప్పున నేను సిద్ధపరచిన "జీతము"నా యొద్ద ఉన్నదని ప్రభువు అనెను?
Result: