1Q. ఏ మార్గము నందు "జీవము" కలదు?
2. దేవుని కుమారుని నామమందు ఏమియుంచు వారు నిత్య"జీవము" గలవారు?
3 Q. నా "జీవము" వట్టి ఊపిరియే అని ఎవరు జ్ఞాపకము చేసికొనెను?
4 Q. "జీవము" ను ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు దేనిని పలుకకుండ తన నాలుకను కాచుకొనవలెను?
5Q. ఎటువంటి మనస్సు "జీవము" ను సమాధానమునై యున్నది?
6Q. మనము "జీవము" గల దేవుని ఏమై యున్నాము?
7Q. "జీవము" గల ప్రతివానికిని తల్లి ఎవరు?
8 Q. యెహోవాను ప్రేమించి, దేనిని విని ఆయనను హత్తుకొనునట్లును "జీవము" ను కోరుకొనవలెను?
9 Q. వేటిని విడిచిపెట్టి, "జీవము" గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగవలెను?
10Q. నిర్జీవక్రియలను విడిచి "జీవము" గల దేవుని సేవించుటకు, యేసురక్తము దేనిని ఎక్కువగా శుద్ధిచేయును?
11Q. సాత్వికమైన మనస్సు దేనికి "జీవము"?
12 Q. "జీవము" గల దేవుని సైన్యములను తిరస్కరించిన సున్నతిలేని ఫిలిష్తీయుడు ఎవరు?
13 . "జీవము" గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపినవాని మాటలను చెవిని బెట్టుమని' ఎవరు ప్రార్ధించెను?
14. ఏది "జీవము" కంటె ఉత్తమము?
15Q.వేటిని అనుసరించువాడు"జీవము"ను నీతిని ఘనతను పొందును?
Result: