①. దర్శనము ప్రవక్త జెకర్యాకు ఏమను పదకొండవ నెలలో యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను?
②. మొదట ఏ గుర్రమునెక్కిన మనుష్యుడు జెకర్యాకు కనబడెను?
③. రెండవసారి జెకర్యాకు ఏమి కనబడెను?
④. మూడవసారి జెకర్యాకు ఏమి చేతపట్టుకొనియున్న యొకడు కనబడెను?
⑤. నాలుగవ సారి జెకర్యాకు సువర్ణమయమైన ఏమి కనబడెను?
⑥. అయిదవసారి జెకర్యాకు ఏమగు పుస్తకము కనబడెను?
⑦. ఆరవసారి జెకర్యాకు ఏమి కనిపించెను?
⑧. ఏడవసారి జెకర్యా తేరి చూడగా వేటి మధ్య నాలుగు రధములు బయలుదేరుచుండెను?
⑨. యెహోవా ఆలయమును ఏమిఅను ఒకడు కట్టును అని యెహోవా జెకర్యాతో చెప్పెను?
①⓪ మిగుల ఆసక్తితో నేను దేని విషయమందు రోషము వహించియున్నానని యెహోవా జెకర్యాతో అనెను?
①①. నాలుగు అయిదు ఏడవ పదియవ నెలలలోని ఉపవాసములు ఎవరి యింటివారికి పండుగలగునని యెహోవా జెకర్యాతో అనెను?
①②. ఎవరి చేతిలో గుండు నూలుండుట చూచి యెహోవా యొక్క యేడు నేత్రములు సంతోషించునని జెకర్యా చెప్పెను?
①③. దేని రెక్కల వంటి రెక్కలు గల ఇద్దరు స్త్రీలను జెకర్యా చూచెను?
①④. దేనిలోనికి పోవు నల్లని గుర్రములున్న రధము నా ఆత్మను నెమ్మదిపరచునని యెహోవా జెకర్యాతో అనెను?
①⑤. యెరూషలేమును సమస్తమైన జనులకు దేనిగా చేతునని యెహోవా జెకర్యాతో అనెను?
Result: