1Q. యెహోవా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో "జ్ఞాపకము చేసికొనుమని ఎవరు కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను?
2Q. నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది "జ్ఞాపకము" చేసికొని ఏమి పొంది ఆ మొదటి క్రియలను చేయవలెను?
3Q. నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను "జ్ఞాపకము" చేసికొనమని యోసేపు ఎవరితో మనవి చేసెను?
4. పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ఎవరు చెప్పిన మాటలు "జ్ఞాపకము" చేసికొనవలెను?
5Q. నా దేవా మందిర విషయములో నన్ను "జ్ఞాపక" ముంచుకొని, నేనుచేసిన ఉపకారములను మరువకుండుమని ఎవరు మనవి చేసెను?
6 Q. దేవా యెహోవా, నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను "జ్ఞాపకము" చేసికొనుమని ఎవరు ప్రార్థనచేసెను?
7Q. దేనిని పరిశుద్ధముగా ఆచరించుటకు "జ్ఞాపక"ముంచుకొనవలెను?
8Q. ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు త్రోవలో దేవుడైన యెహోవా ఎవరికి చేసిన దానిని "జ్ఞాపకముంచుకొనవలెను?
9 Q. యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక "జ్ఞాపకము" చేసికొనమని ఎవరు ప్రార్ధించెను?
10 Q. ఏమి చేయువారి "జ్ఞాపకము" ను భూమిమీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది?
11Q. మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని "జ్ఞాపకము" చేసికొని, వారి యొక్క దేనిని శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించవలెను?
12. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను "జ్ఞాపకము" చేసికొని, దయచేసి యీసారి మాత్రమే నన్ను బలపరచుమని ఎవరు మొఱ్ఱపెట్టెను?
13 Q. ఎవరిని "జ్ఞాపకము" చేసికొనుట ఆశీర్వాదకర మగును?
14. నా యేలినవాడవగు నీకు, యెహోవా మేలు చేసిన తరువాత నీవు, నీ దాసురాలనగు నన్ను "జ్ఞాపకము" చేసికొనుమని ఎవరు దావీదుతో అనెను?
15Q. మనము ఏదశలోనున్నప్పుడు యెహోవా మనలను "జ్ఞాపకము" చేసికొనెను?
Result: