1Q. ఏ తండ్రి తన కుమారుని యెహోవాకు బలి అర్పించి తిరిగి పొందెను?
2 Q. మొదటి కవలల తండ్రి ఎవరు?
3. ఐగుప్తులో నున్న తన కుమారుని యొద్దకు వెళ్ళి నివసించిన తండ్రి ఎవరు?
4 Q. ఏ తండ్రి తన కుమార్తెను యెహోవాకు మ్రొక్కుబడి చేసుకొనిన ప్రకారము దహనబలిగా అర్పించెను?
5 Q. గొర్రెల కాపరియై రాజుగా అభిషేకము పొందిన దావీదు తండ్రి ఎవరు?
6Q. ఇశ్రాయేలీయుల ప్రవక్త యైన సమూయేలు తండ్రి ఎవరు?
7Q. ఇశ్రాయేలీయుల మొదటి రాజు యైన సౌలు తండ్రి పేరేమిటి?
8 Q. అరువది మంది కుమార్తెలు గల తండ్రి ఎవరు?
9 Q. తన యింటికి కీడు కలిగినందున ఏ తండ్రి తన కుమారునికి బెరీయా అని పేరు పెట్టెను?
10Q. యెహోవా ముద్ర యుంగరముగా చేసిన జెరుబ్బాబెలు తండ్రి పేరేమిటి?
11: యేసు శిష్యుడైన మరొక యాకోబు తండ్రి ఎవరు?
12Q. కన్యకలుగా ఉండి ప్రవచించు నలుగురు కుమార్తెలు కలిగిన తండ్రి ఎవరు?
13Q. పత్మాసు ద్వీపమున పరవాసివై ఆత్మవశుడై యున్న యోహాను తండ్రి పేరేమిటి?
14Q. పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు క్రీస్తు నొద్ద నుండి పొందుకొన్న పేతురు తండ్రి పేరేమిటి?
15Q. తన ఏకైక కుమారుని మనుష్యుల పాప విమోచనకై బలిగా అర్పణగా అర్పించిన తండ్రి ఎవరు?
Result: