Bible Quiz in Telugu Topic wise: 366 || తెలుగు బైబుల్ క్విజ్ ("తండ్రి" అనే అంశముపై క్విజ్-2)

1Q. తండ్రీ, నా తండ్రీ ఇశ్రాయేలు వారి రధములును రౌతులును నీవే అని ఎవరు ఎలీషా గూర్చి యేడ్చెను?
A ఆహాబు
B యోహు
C యెహోయస్సు
D బయోష
2. ఎవరికి యోబు తండ్రిగా నుంటిననెను?
A సేవకులకు
B దరిద్రులకు
C పెదలకు
D బీదలకు
3. తండ్రి యొక్క ఉపదేశము ఏమి పొందునట్లు కుమారులు ఆలకించవలెను?
A జ్ఞానము
B సమృద్ధి
C భయము
D వివేకము
4. తండ్రులే కుమారులకు ఏమై యున్నారు?
A ఆభరణము
B కిరీటము
C అలంకారము
D మకుటము
5 . తండ్రులు తమ పిల్లలకు కోపము రేపక వారిని ప్రభువు యొక్క దేనిలో పెంచవలెను?
A భయము భక్తిలోను
B శిక్ష బోధలోను
C ఆజ్ఞ కట్టడలోను
D మాట విధులలోను
6 ప్ర. మృతులను సజీవులనుగా చేయు దేవుని యెదుట ఎవరు మనకందరికి తండ్రియై యున్నాడు?
A యేసుక్రీస్తు
B అబ్రాహాము
C ఇశ్రాయేలు
D పౌలు
7ప్ర. చావ సిద్ధముగా నున్న తన కుమార్తెను బ్రదికించుమని యేసు పాదముల మీద పడిన తండ్రి ఎవరు?
A యాయీరు
B లెబ్బయి
C బర్సబా
D మత్తయి
8 ప్ర. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి హెచ్చరించుమని పౌలు ఎవరికి చెప్పెను?
A ఏపప్రకు
B తీతుకు
C తిమోతికి
D ఒనేసీముకు
9 . తండ్రి యైన దేవుని వలన మనము ఏమి పొందియున్నాము?
A జన్మను
B ఆజ్ఞను
C బ్రదుకును
D విధులను
10 . తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైన దేనిని మేము చూచితిమని యోహాను అనెను?
A కృపావరమును
B జీవపువెలుగును
C నిత్యజీవమును
D ఆత్మప్రవేశమును
11: తండ్రి ద్రియైనదేవుని చిత్తప్రకారము ప్రస్తుతపు దేనిలో నుండి విమోచింపవలెనని క్రీస్తు మన పాపములకు తన్నుతాను అప్పగించుకొనెను?
A పాపలోకములో
B దుష్టకాలములో
C అంధకారక్రియలలో
D హేయకార్యములలో
12. తండ్రి యైన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడిన వారికి ఎవరు పత్రిక వ్రాసెను?
A పౌలు
B యోహాను
C యూదా
D యాకోబు
13 . తన యొద్దకు వచ్చునట్లు తండ్రి ఆకర్షించిన వారిని యేసు ఎప్పుడు లేపుదుననెను?
A అంత్యదినమున
B రాకడసమయమున
C యెహోవాదినమున
D ఉగ్రతదినమున
14. యేసుక్రీస్తు వలన వినిన తండ్రి యొక్క దేని కొరకు కనిపెట్టుకొనవలెను?
A రాజ్యము
B నివాసము
C వాగ్దానము
D రాకడ
15. తండ్రి నాకనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? అని యేసు ఎవరితో అనెను?
A కయపతో
B ఫిలాతుతో
C పేతురుతో
D హేరోదుతో
Result: