①. తండ్రికుమారులైన అబ్రాహాము ఇష్మాయేలును ఒక్కదినమందే ఏమి పొందిరి?
②. తండ్రియైన ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో ఎక్కడికి పోయి వేటాడి మాంసము తెమ్మనెను?
③. తండ్రియైన యాకోబు తన కుమారులకు ఎప్పుడు సంభవింపబోవు సంగతులను తెలిపెను?
④. ప్ర.తండ్రియైన మోషే అన్యదేశములో పుట్టిన తన కుమారునికి ఏమని పేరు పెట్టెను?
5. తండ్రియైన అహరోను యొక్క మూడవ కుమారుడైన ఎలియాజరు ఎవరితో పాటు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యములు పంచెను?
⑥. తండ్రియైన యోరుబ్బయలు చనిపోయిన తర్వాత అబీమెలెకు అతని కుమారులను చంపించగా తప్పించుకొనినదెవరు?
⑦. తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్న తన కుమారులను అడ్డగింపని తండ్రి ఎవరు?
⑧. తన తండ్రి చేయుచున్న చెడుపనిని అడ్డగించిన కుమారుడు ఎవరు?
⑨. తండ్రియైన దావీదుకు తెలియకుండా తనను రాజుగా ప్రకటించుకొనిన కుమారుడు ఎవరు?
①⓪. యెహోవాకు విరోధముగా వాదించిన తమ తండ్రి యైన ఎవరిని భూమి మ్రింగిన కుమారులు చావలేదు?
①①. నిండు మనస్సుతో యెహోవాను అనుసరించిన కుమారుడు కాలేబును కన్న తండ్రి ఎవరు?
①②. ఏ తండ్రి కుమారుడైన బిలాము ఇశ్రాయేలీయులను శపించుటకు వచ్చెను?
①③. ఏ తండ్రి కుమారుడైన మాకీరు యుద్ధవీరుడు?
①④. ఏ తండ్రి కుమారుడైన ఎజ్రా ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి?
①⑤. ఏ తండ్రి కుమారుడైన నెహెమ్యా యెరూషలేము గురించి ఉపవాసముండి ఏడ్చెను?
Result: