Bible Quiz in Telugu Topic wise: 368 || తెలుగు బైబుల్ క్విజ్ ("తడవు" అనే అంశముపై క్విజ్)

1. శనమగు పట్టణము నుండి తప్పించుటకు దేవదూతలు వచ్చి వెలుపలికి రమ్మనగా ఎవరు "తడవు"చేసెను?
ⓐ లోతు
ⓑ హిజ్కియా
ⓒ ఆసా
ⓓ ఏశావు
2. యెహోవా నా ప్రయాణము సఫలము చేసెను గనుక "తడవు"కానీయక నన్ను పంపుడని అబ్రాహాము సేవకుడు ఎవరి కుటుంబికులతో అనెను?
ⓐ మిల్కా
ⓑ రిబ్కా
ⓒ నయమా
ⓓ హాగరు
3. మాకు "తడవు"కాకపోయిన యెడల రెండవమారు తిరిగి వచ్చియుందుమని ఎవరు తన తండ్రియైన ఇశ్రాయేలుతో అనెను?
ⓐ రూబేను
ⓑ యూదా
ⓒ షిమ్యోను
ⓓ లేవి
4. ఎక్కడ నుండి ఇశ్రాయేలీయులు వెళ్లగొట్టబడి "తడవు"చేయలేకపోయిరి గనుక పిండి ముద్ద పులిసియుండలేదు?
ⓐ షూరు నుండి
ⓑ మోయాబు నుండి
ⓒ ఐగుప్తు నుండి
ⓓ ఎదోము నుండి
5. ఇశ్రాయేలీయులు మొదటి వేటిని అర్పింప "తడవు"చేయకూడదని యెహోవా సెలవిచ్చెను?
ⓐ భూఫలమును
ⓑ ధాన్యమును
ⓒ పశువును
ⓓ సస్యద్రవ్యములను
6. మోషే కొండ దిగకుండ "తడవు "చేయుట చూచిన ప్రజలు ఆహరోనును వారి ముందర నడుచుటకు దేనిని చేయమనిరి?
ⓐ ఒక కొయ్యబొమ్మను
ⓑ ఒక విగ్రహమును
ⓒ ఒక దేవతను
ⓓ ఒక చెక్కడమును
7. మోయాబు రాజైన ఎగ్లోను దాసులు తడవు"చేయుచుండగా ఎవరు తప్పించుకొనిపోయెను?
ⓐ ఏహూదు
ⓑ గిద్యోను
ⓒ బారాకు
ⓓ యెఫ్తా
8. లేవీయుడు అతని ఉపపత్ని తండ్రి ఎప్పటి వరకు "తడవు" చేసి యిద్దరు కూడి భోజనము చేసిరి?
ⓐ ప్రొద్దువాలు
ⓑ అర్ధరాత్రి
ⓒ సాయంత్రము
ⓓ మధ్యాహ్నము
9. రాక, అతని రధము "తడవు"చేయనేల? అని ఎవరి తల్లి కేకలు వేసెను?
ⓐ ఆహజ్యా
ⓑ సీసెరా
ⓒ యెహోరాము
ⓓ ఆజర్యా
10. ఎవరు మధ్యాహ్నకాలమందు "తడవు" లాడుదురని యోబు అనెను?
ⓐ దుష్టులు
ⓑ దుర్మార్గులు
ⓒ కపటులు
ⓓ ద్రోహులు
11. కన్నులు లేనివారి వలె "తడవు" లాడుచున్నామని ఎవరు అనెను?
ⓐ యిర్మీయా
ⓑ మీకా
ⓒ ఓబద్యా
ⓓ యెషయా
12. యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఇశ్రాయేలీయులు గ్రుడ్డివారి వలె ఎప్పుడు "తడవు"లాడుదురని యెహోవా అనెను?
ⓐ మధ్యాహ్నమందు
ⓑ పగటివేళ
ⓒ వెలుగునందు
ⓓ సూర్యోదయవేళ
13. యాకోబు కుమార్తె దీనా యందు ప్రీతిగలవాడైన ఎవరు సున్నతి కార్యము చేయుటకు "తడవు"చేయలేదు?
ⓐ యెజెరు
ⓑ షెకెము
ⓒ షాఫాను
ⓓ యాబీరు
14. రాజదేహసంరక్షకుల అధిపతి ఎవరితో మాటలాడి వెళ్లమనినప్పుడు అతడు వెళ్లక "తడవు"చేసెను?
ⓐ దానియేలు
ⓑ మీకాయా
ⓒ యిర్మీయా
ⓓ నెహెమ్యా
15. సౌలుగా యున్న పౌలుతో ఎవరు నీవు "తడవు"చేయుట ఎందుకు? బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసుకొనుమని చెప్పెను?
ⓐ గమలీయేలు
ⓑ ఫిలిప్పు
ⓒ ఆకుల
ⓓ అననీయ
Result: