Bible Quiz in Telugu Topic wise: 369 || తెలుగు బైబుల్ క్విజ్ ("తరిమి" అనే అంశముపై క్విజ్)

1. ఎవరు అతని దాసులతో శత్రురాజులను "తరిమి"ఆస్తి యావత్తును తెచ్చెను?
ⓐ అబ్రాహాము
ⓑ ఇస్సాకు
ⓒ యాకోబు
ⓓ యోసేపు
2. యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల నీవు ఏమగు వరకు శాపములన్నియు నిన్ను "తరిమి" పట్టుకొనును అని ఇశ్రాయేలీయులతో మోషే చెప్పెను?
ⓐ మరణము
ⓑ నాశనము
ⓒ వినాశము
ⓓ పతనము
3. మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను ఎవరు "తరిమి"వారి సేననంతను చెదరగొట్టెను?
ⓐ బారాకు
ⓑ గిద్యోను
ⓒ సమ్సోను
ⓓ యెఫ్తా
4. నా శత్రువులను "తరిమి"నాశనము చేయుదునని ఎవరు అనెను?
ⓐ సొలొమోను
ⓑ ఆసా
ⓒ హిజ్కియా
ⓓ దావీదు
5. యూదా రాజైన ఎవరిని యెహూ "తరిమి"రధము నందు అతని హతము చేయుమని ఆజ్ఞ ఇచ్చెను?
ⓐ ఆహాజును
ⓑ ఆజర్యాను
ⓒ ఆహజ్యాను
ⓓ ఆహూజును
6. భయములు జలప్రవాహము వలె ఎవరిని "తరిమి"పట్టుకొనును అని యోబు అనెను?
ⓐ దుర్మార్గులను
ⓑ భక్తిహీనులను
ⓒ మూర్ఖులను
ⓓ మూఢులను
7. నీవు కోపావేశుడవై శత్రువులను "తరిమి" నీయొక్క ఆకాశము క్రింద నుండకుండా నశింపజేయుదువని ఎవరు యెహోవాతో అనెను?
ⓐ యిర్మీయా
ⓑ యెహెజ్కేలు
ⓒ ఓబద్యా
ⓓ యెషయా
8. ఐగుప్తు దేశమునకు వెళ్లవలెనని నిశ్చయించుకొనిన యూదా శేషమును అక్కడ ఏమి "తరిమి"పట్టుకొనునని యెహోవా అనెను?
ⓐ తెగులు
ⓑ ఖడ్గము
ⓒ కరవు
ⓓ క్షామము
9. ఏ దండు సిద్కియా రాజును "తరిమి" యెరికో మైదానములో అతని కలుసుకొనెను?
ⓐ మోయాబు
ⓑ ఎదోము
ⓒ కల్దీయుల
ⓓ ఐగుప్తు
10. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి ఆప్పగించియున్నాడు గనుక వారిని "తరిమి"కొట్టివేయుమని ఎవరు ఇశ్రాయేలీయులతో అనెను?
ⓐ ఆహరోను
ⓑ కాలేబు
ⓒ ఎలియాజరు
ⓓ యెహొషువ
11. రాత్రి ఏమి దాటిపోవునట్లు భక్తిహీనులు "తరిమి"వేయబడుదురు?
ⓐ స్వప్నము
ⓑ కల
ⓒ దర్శనము
ⓓ చీకటి
12. ఐగుప్తు రాజైన ఫరో యొక్క దేనిని బట్టి అతనిని "తరిమి వేసెదనని యెహోవా అనెను?
ⓐ దుష్కార్యమును
ⓑ దుష్టత్వమును
ⓒ దుర్మార్గమును
ⓓ నీచత్వమును
13. ఏది మనలను "తరిమి"పట్టదు అనుకొను పాపాత్ములందరును ఖడ్గము చేత చత్తురని యెహోవా అనెను?
ⓐ తెగులు
ⓑ వాత
ⓒ కీడు
ⓓ కరవు
14. రాజును మానవులలో నుండి "తరిమిరి"?
ⓐ ఫరోనెకోను
ⓑ మేషాను
ⓒ ఆహాబును
ⓓ నెబుకద్నెజరును
15. ఒకడు ఎక్కడ రాయి వేసినట్లు ఇశ్రాయేలీయులను "తరిమిన"వారిని యెహోవా అగాధజలములలో పడవేసెను?
ⓐ లోత నీట
ⓑ తటాకములొ
ⓒ కొలనులో
ⓓ నదిలో
Result: