1. తెల్లని ఉన్నిని పోలిన "తల వెండ్రుకలు" గల మనుష్యకుమారుని ఎవరు చూచెను?
2. ప్రియుడైన యేసు "తల వెండ్రుకలు" కాకపక్షముల వలె ఎలా యున్నవి?
3. చెయ్యి వంటిది ఒకటి చాపి యెహోవా ఎవరి "తల వెండ్రుకలు" పట్టుకొనెను?
4. తనకు కలిగిన శ్రమను బట్టి "తల వెండ్రుకలు" గొరిగించుకొనినదెవరు?
5. తన్ను యోగ్యుడని అగుపరచుకొనిన వాని యొక్క " తల వెండ్రుకలలో "ఒకటైనను క్రిందపడదని ఎవరు అనెను?
6. యెహోవాకు ఏమి అగుటకు మ్రొక్కుకొనిన వాడు తన "తల వెండ్రుకలు"ఎదగనియ్యవలెను?
7. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా "తల వెండ్రుకల"కంటే విస్తారముగా నున్నారని ఎవరు అనెను?
8. మహావృద్ధుని "తల వెండ్రుకలు" ఎటువంటి గొర్రెబొచ్చువలె తెల్లగా నుండెను?
9. ఎవరి "తల వెండ్రుకలు" పక్షిరాజు రెక్కల ఈకెల వంటివాయెను?
10. ఎవరు తమ "తల వెండ్రుకలు" క్షౌరము చేయించుకొనకుండా కత్తిరించుకొనవలెను?
11. ఎవరికి తన "తల వెండ్రుకలు" భారముగా నున్నందున ఏటేట కత్తిరించుచు వచ్చెను?
12. మన "తల వెండ్రుకలు"ఏమై యున్నవి గనుక భయపడకుడి అని యేసు అనెను?
13. ప్రభువు నామము నిమిత్తము మనుష్యుల చేత ఏమైన వారి "తల వెండ్రుకలలో" ఒకటైనను నశించదని యేసు చెప్పెను?
14. తనకు మ్రొక్కుబడి యున్నందున పౌలు ఎక్కడ తన "తల వెండ్రుకలు" కత్తిరించుకొని యుండెను?
15. స్త్రీకి "తల వెండ్రుకలు" దేనిగా ఇయ్యబడెను?
Result: