1. ఓడ చేసిఎక్కడ"తలుపును" ఉంచమని యెహోవా నోవహుతో చెప్పెను?
2. ఎవరు పట్టణపు "తలుపులను"వాటి ద్వారబంధములను ఊడబెరికి మోసుకొనిపోయెను?
3. గర్భాలయ ద్వారములకు దేనితో సొలొమోను "తలుపులను"చేయించెను?
4. ప్రదాన యాజకుడైన ఎవరు యాజకులతో కలిసి గొర్రెల గుమ్మములు కట్టి ప్రతిష్టించి "తలుపులు"నిలిపిరి?
5. ఏ మనుష్యులు లోతు ఇంటిమీద దొమ్మిగా పడి "తలుపులు"పగులగొట్టుటకు సమీపించిరి?
6. దేవుని దర్శనము పొందిన ఎవరు మందిరపు "తలుపులను"తీసెను గాని భయపడి సంగతిని చెప్పలేకపోయెను?
7. యెహోవా శపించిన యెరికోను కట్టి "తలుపులను"నిలువబెట్టిన వాని యొక్క ఎవరు చనిపోవును?
8. ఎవరు తన యేలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు "తలుపులను"తెరచి వాటిని బాగుచేసెను?
9. ఏ " తలుపులను" పగులగొట్టెదనని యెహోవా సెలవిచ్చెను?
10. ఎవరు ప్రవేశించునట్లు పురాతనమైన "తలుపులను"తలపైకెత్తుకొనుమని దావీదు చెప్పెను?
11. ఏ సంఘము యెదుట యెహోవా తీసియుంచిన "తలుపులను"ఎవరును వేయనేరడని ఆయన చెప్పెను?
12. తలవాకిట పేతురు "తలుపు" తట్టుచుండగా ఏ చిన్నది ఆలకించుటకు వచ్చెను?
13. "తలుపు" తీయుమని ప్రియుడైన యేసు ఏమి తట్టుచున్నాడు?
14. "తలుపు" తట్టుచున్న ప్రభువు స్వరము విని "తలుపును"తీసిన వానితో ఆయన ఏమి చేయును?
15. ఎవరు పెండ్లికుమారునితో పెండ్లి విందుకు లోపలికి పోగా "తలుపు"వేయబడెను?
Result: