①. 'తిండి' అనగా ఏమిటి?
②. తినుదానిలో నుండి "తిండి"వచ్చెనను దేనిని సమ్సోను తన స్నేహితులతో చెప్పెను?
③. ప్ర. ఏలికతో భోజనము చేయునపుడు "తిండి" పోతులు తమ గొంతుకకు ఏమి పెట్టుకొనవలెను?
④. ఏవి "తిండికి"ఆతురపడును?
⑤. హృదయములు "తిండి"వలన ఎలా ఉన్నందున అది ఉరి కాకుండునట్లు జాగ్రత్తగా ఉండవలెను?
⑥. తినుదానిలో నుండి "తిండి"వచ్చునని సమ్సోను చెప్పినది దేనిని తెలుపును?
⑦. ఒకడు మొండివాడై తిరుగుబాటు చేసిన వాడైతే అతని తల్లిదండ్రులు అతను "తిండి"పోతు ఆయెనని ఎవరికి చెప్పవలెను?
⑧. తిండి లేక తిరుగులాడు ఏవి దేవునికి మొర్రపెట్టునని యెహోవా యోబుతో అనెను?
⑨. తిండిపోతులు ఏమగుదురు?
①⓪. తిండికి" ఆతురపడు కుక్కల వంటి వారైన ఎవరు వివేచింపజాలరని యెహోవా సెలవిచ్చెను?
①①. ఎవరు తినుచు త్రాగుచు వచ్చినందున ఆయనను "తిండి"పోతు అని అనిరి?
12. తనను చంపుటకు వచ్చిన వారు "తిండి"కొరకు ఇటు అటు తిరుగులాడుదురని ఎవరు అనెను?
13. ఒక్క పూట కూటి(తిండి)కోసము జ్యేష్టత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు ఎవరని పౌలు అనెను?
①④. ఎవరు సోమరులగు "తిండి"పోతులని వారి సొంత ప్రవక్తలలో ఒకడు అనెను?
①⑤. తిండిపోతుతనము దేనికి సాదృశ్యముగా నుండెను?
Result: