Bible Quiz in Telugu Topic wise: 379 || తెలుగు బైబుల్ క్విజ్ ("తెగులు" అనే అంశము పై క్విజ్)

1. మొదట ఏదేశము మీదికి యెహోవా తెగుళ్ళు రప్పించెను?
ⓐ సొదొమ
ⓑ గొమొర్రా
ⓒ ఐగుప్తు
ⓓ సిరియ
2. ఎన్ని తెగుళ్ళు ఐగుప్తు మీదికి వచ్చెను?
ⓐ పదిహేను
ⓑ పది
ⓒ పదియేడు
ⓓ ఇరువది
3. ఎన్నవ తెగులు తర్వాత ఫరో ఇశ్రాయేలీయులను పోనిచ్చెను?
ⓐ అయిదవ
ⓑ మూడవ
ⓒ యేడవ
ⓓ పదవ
4. దేని మీద ఆపేక్ష కలిగి యెహోవాకు విరోధముగా మాట్లాడినవారు తెగులు చేత చచ్చిరి?
ⓐ వస్త్రము
ⓑ మాంసము
ⓒ ఆహారము
ⓓ ధనము
5. ఐగుప్తులో యున్న భయంకరమైన తెగులు ఏమిటి?
ⓐ క్షయ
ⓑ కుష్టు
ⓒ చాంద్ర
ⓓ చర్మ
6. ఇశ్రాయేలీయులు మోయాబు దేవతలతో కలిసికొనినందున ఎంతమంది తెగులు చేత చచ్చిరి?
ⓐ ముప్పదిమూడు వేలు
ⓑ ఇరువదినాలుగువేలు
ⓒ పదహారువేలు
ⓓ నలువదివేలు
7. కోరహు విషయములో మోషే, అహరోనులకు విరోధముగా సణిగిన ఎంతమంది తెగులు చేత చచ్చిరి?
ⓐ మూడువేల నాలుగువందలు
ⓑ యేడువేల అయిదు వందలు
ⓒ పదునాలుగువేల యేడు వందలు
ⓓ ఇరువది వేల ఆరువందలు
8. దావీదు జనసంఖ్య లెక్కింపమనినపుడు యెహోవా కోపముచే వచ్చిన తెగులు వలన ఎంతమంది మృతిచెందిరి?
ⓐ డెబ్బదివేలు
ⓑ యాబదివేలు
ⓒ నలువదివేలు
ⓓ ఎనుబదివేలు
9. "దేవుడైన యెహోవా"అను ఆ భీకరనామమునకు భయపడని యెడల ఎటువంటి తెగుళ్ళు ఆయన కలుగజేయును?
ⓐ భీతిగొల్పే
ⓑ కలవరపరచే
ⓒ ఆశ్చర్యమైన
ⓓ దిగులుపడే
10. ఈ ఆశ్చర్యమైన తెగుళ్ళు ఎప్పటి వరకు యుండు గొప్ప తెగుళ్ళు, చెడ్డరోగములునై యుండును?
ⓐ అర్ధకాలము
ⓑ కాలము
ⓒ కాలములు
ⓓ దీర్ఘకాలము
11. జనులు తమ క్రియల చేత యెహోవాకు కోపము పుట్టించి తెగులుకు గురియై నపుడు ఎవరు పరిహారము చేసెను?
ⓐ మోషే
ⓑ ఫీనెహాసు
ⓒ అహరోను
ⓓ యెహొషువ
12. కడపటి యేడు తెగుళ్ళు నిండిన వేటిని యేడుగురు దూతలు పట్టుకొని యుండెను?
ⓐ యేడు కుండలు
ⓑ గిన్నెలును
ⓒ యేడు పాత్రలు
ⓓ బానలును
13. మహోన్నతుడైన దేవుని చాటున నివసించినపుడు ఎటువంటి తెగులు రాకుండా ఆయన రక్షించును?
ⓐ భయంకరమైన
ⓑ కలతలు గల
ⓒ వణికించే
ⓓ నాశనకరమైన
14. యెహోవాను ఆశ్రయించిన యెడల ఎక్కడ సంచరించు తెగులునకైనను భయపడకుందురు?
ⓐ చీకటిలో
ⓑ లోకములో
ⓒ పగటిలో
ⓓ రాత్రివేళలో
15. మహోన్నతుడైన దేవుని మనకు నివాసస్థలముగా చేసుకొనిన యెడల ఏ తెగులును ఎక్కడికి సమీపించదు?
ⓐ నివాసమునకు
ⓑ గృహమునకు
ⓒ చుట్టూరును
ⓓ గుడారమునకు
Result: