1. వినుటకు ఉపయోగపడే అవయవములు ఏవి?
2. వినడము అనగా అర్ధమేమి?
3. వినుట ఎవరి గూర్చిన మాట వలన కలుగును?
4. ఎక్కడ పాపమును లక్ష్యము చేసిన ప్రభువు మన మనవి వినకపోవును?
5. ఇశ్రాయేలు జనుల యొక్క ఏమి నాదము వినుటకు నాకు మనస్సు లేదని యెహోవా అనెను?
6. యేసు బోధను వినుచున్న చెవులు ఏమైనవి?
7. యేసు సువార్తను వినిన విశ్వాసులు ఏమి చేయబడు ఆత్మవలన ముద్రించబడిరి?
8. జనులు యెహోవాకు ఎలా చేయుచున్న సణుగులు ఆయనకు వినబడెను?
9. ప్రభువు యొక్క చెవులు ఎవరి ప్రార్ధనల వైపు యున్నవి?
10. దేవుని మాటలు విని ఆయన పంపిన వానియందు విశ్వాసముంచువాడు ఏమి గలవాడు?
11. చెవి గలవాడు ఎవరు సంఘములతో చెప్పుచున్న మాట వినును?
12. దేనిని గూర్చి విని యోహాను మనకు తెలియజేయుచున్నాడు?
13. జనులు నిత్యము వినుచుందురు గాని ఏమి చేయక యుందురు?
14. ఎప్పుడు లేచి యెహోవా మనతో మాట్లాడు మాటలు వినవలెను?
15. దేనిని ఆలకించమని, దేనిని చెవియొగ్గమని యెహోవా సెలవిచ్చెను?
Result: