1Q. యెహోవా - "నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను" అని ఎవరినుద్దేశించి చెప్పెను?
2Q. యెహోవా మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండునని ఇశ్రాయేలీయులతో ఎవరు చెప్పెను?
3 Q. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించమని ప్రార్థించినదెవరు?
4. దేవుడు నీకు తోడైయున్నాడు, నీ హృదయమందున్న దంతయు చేయుమని దావీదుతో ఎవరనెను?
5 Q. దావీదు సమస్త విషయములలో ఏమికలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగానుండెను?
6. నా కట్టడలను, ఆజ్ఞలను గైకొనినయెడల నేను నీకుతోడుగా ఉండి నిన్ను స్థిరపరచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదనని యెహోవా ఎవరితో అనెను?
7Q. యెహోవా జీవము తోడు నామాట ప్రకారముగాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ఎవరు ప్రవచించెను?
8 Q. ఎవరికి యెహోవా తోడుగా నుండును?
9Q. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. పై వాక్యం యొక్క రిఫరెన్స్ తెలపండి?
10 Q. నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు, నేను ఇశ్రాయేలీయులపైన అధికారము చేసెదనని యెహోవా ఎవరి ద్వారా ప్రకటించెను?
11: నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము, నేను నీకు తోడైయుందునని యెహోవా ఎవరికి సెలవిచ్చెను?
12. మీరు బ్రదుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల యెహోవా మీకు తోడుగానుండునని ఎవరు ప్రకటించెను?
13. జనులకు నేను తోడుగా వున్నానని యెహోవా, ఆయన దూతయైన ఎవరి ద్వారా ప్రకటించెను?
14. యెహోవా జీవముతోడు అను మాట పలికినను, వారు దేనికై ప్రమాణము చేయుదురు?
15Q. నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదునని యెహోవా ఎవరితో అనెను?
Result: