①. "Wolves" అనగా అర్ధము ఏమిటి?
②. ఎవరు చీల్చునట్టి "తోడేలు"అని యాకోబు అనెను?
③. యెహోవా యొక్క దేని మీద "తోడేళ్లును" గొర్రెపిల్లలను కలిసి మేయును?
④. తిరుగుబాటు చేసి బహుగా ఏమైన వారి మీదికి అడవి "తోడేలు"వచ్చి వారిని నాశనము చేయును?
⑤. దేనిలోని అధిపతులు నరహత్య చేయుటలోను మనుష్యులను నశింపజేయుటలోను వేటను చీల్చు "తోడేళ్లవలె ఉన్నారు?
⑥. ఎవరి గుర్రములు రాత్రి యందు తిరుగులాడు "తోడేళ్ళ"కంటెను చురుకైనవి?
⑦. ఎటువంటి పట్టణము మధ్యలోని అధిపతులు ఎరలో ఏమియు మిగులకుండ భక్షించు "తోడేళ్లు"?
⑧. ఎవరు గొర్రెల చర్మములు వేసుకొనినను లోపల క్రూరమైన "తోడేళ్లు"?
⑨. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లు మిమ్మును పంపుచున్నానని యేసు ఎవరితో అనెను?
①⓪. తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లలను పంపునట్లు పంపుచున్నానని యేసు తాను నియమించిన ఎంతమందితో అనెను?
①①. ఎవరు గొర్రెల కాపరికాడు గనుక "తోడేలు"వచ్చుట చూచి పారిపోవును?
①②. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన "తోడేళ్లు"మీలో ప్రవేశించునని నాకు తెలియునని ఎవరు శిష్యులతో అనెను?
①③. జీతగాడు "తోడేలు' వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోగా "తోడేలు" గొర్రెలను ఏమిచేయును?
①④. యెష్షయి మొద్దు నుండి పుట్టిన చిగురు పుట్టినపుడు "తోడేలు"దేని యొద్ద వాసము చేయును?
①⑤. పరిశుద్ధగ్రంధములో "తోడేలు"దేనికి సాదృశ్యము?
Result: