1. "Siblings" అనగా అర్ధము ఏమిటి?
2. తోబుట్టువులను ఏమని పిలుచుదురు?
3. నయమా ఎవరి "సహోదరి"?
4. ఎవరి సహోదరులు"అతని చంపుటకు దురాలోచన చేసిరి?
5. ఏ గుహలోనికి దావీదు తప్పించుకొనిపోయిన సంగతి విని అతని "సహోదరులు" అతని యొద్దకు వచ్చిరి?
6. గాతీయులు చంపిన తన కుమారుల నిమిత్తము ఎవరు దు:ఖించుచుండగా అతని "సహోదరులు" అతని పరామర్శించిరి?
7. తన "సహోదరుడగు" ఆశాహేలు ప్రాణము తీసిన ఎవరిని యోవాబు చంపెను?
8. యెహోషాపాతు కుమారుడైన ఎవరు తన్ను స్థిరపరచుకొని తన "సహోదరులందరిని హతము చేసెను?
9. ఎవరు తన "సహోదరుల"కంటే హెచ్చినవాడాయెను?
10. ఎవరి కుమార్తెలకు యెహోషువ వారి తండ్రి యొక్క "సహోదరులలో" స్వాస్థ్యము ఇచ్చెను?
11. ఎస్తేరు "సహోదరుడైన"ఎవరు ఆమెకు తండ్రి అయ్యెను?
12. మేము మెస్సీయాను కనుగొంటిమని ఎవరు తన "సహోదరుడైన"సీమోనుతో చెప్పెను?
13. మరియ మార్తా అనే "అక్కాచెల్లెండ్రు" ఏ గ్రామములో నివసించెడివారు?
14. ప్రభువు "సహోదరుడైన "ఎవరిని పౌలు చూచెను?
15. "సహోదరులు"ఏమి కలిగియుండుట మేలు మనోహరము?
Result: