1. ఇశ్రాయేలీయులకు ఎటువంటి "త్రాసు" ఉండవలెనని యెహోవా సెలవిచ్చెను?
2. నా దు:ఖము సరిచూచుటకై నాకు వచ్చిన ఎటువంటి "త్రాసులో" అది పెట్టబడును అని యోబు అనెను?
3. అల్పులైనవారు ఘనులైన వారు "త్రాసులో"తేలిపోవుదురని ఎవరు అనెను?
4. దొంగ " త్రాసు" యెహోవాకు ఎటువంటిది?
5. న్యాయమైన "త్రాసు"యెహోవా యొక్క ఏమై యున్నది?
6. జనులు "త్రాసు"మీద నున్న దేని వంటివారు?
7. ఎవరు " త్రాసులో" వెండి తూచి ఇచ్చి క్రయపత్రమును తీసుకొనెను?
8. తల గడ్డము క్షౌరము చేసుకొని ఆ వెండ్రుకలను "త్రాసులో" తూచమని యెహోవా ఎవరితో చెప్పెను?
9. ఖరా "త్రాసులను"మీరుంచుకొనవలెనని యెహోవా ఇశ్రాయేలీయుల ఎవరితో చెప్పెను?
10. దొంగ "త్రాసు" ఏమి కాదు?
11. ఏమి అనగా యెహోవా నిన్ను "త్రాసులో" తూచగా నీవు తక్కువ కనబడితివను అర్ధము?
12. తూము చిన్నదిగా చేసి దొంగ "త్రాసు" చేసితిరని యెహోవా ఎవరి గూర్చి అనెను?
13. అన్యాయపు "త్రాసును"వాడుక చేసెదరని యెహోవా ఎవరి గురించి చెప్పెను?
14. తప్పు "త్రాసు"నుంచుకొని నేను ఏమగుదునా?అని పట్టణము అనుకొనవలెనని యెహోవా ప్రకటన చేసెను?
15. ఏ గుర్రము మీద కూర్చొని యున్న ఒకడు "త్రాసు"చేత పట్టుకొని యుండెను
Result: