Bible Quiz in Telugu Topic wise: 389 || తెలుగు బైబుల్ క్విజ్ ("దండము" అనే అంశము పై క్విజ్)

1. బాలుని హృదయములో స్వాభావికముగా పుట్టు దేనిని శిక్షా"దండము"తోలివేయును?
ⓐ మూఢత్వము
ⓑ దుష్టత్వము
ⓒ మూర్ఖత్వము
ⓓ గర్వాంధము
2. యెహోవా తన "దండము" నా మీద నుండకుండా తీసివేయవలెనని ఎవరు అనెను?
ⓐ దావీదు
ⓑ యోబు
ⓒ హిజ్కియా
ⓓ మోషే
3. దేవుని "దండము"ఎవరి మీద పడుట లేదని యోబు అనెను?
ⓐ బుద్ధిహీనుల
ⓑ మూర్ఖుల
ⓒ భక్తిహీనుల
ⓓ దుష్టుల
4. యెహోవాకు విరోధముగా లేచిన ఎవరిని ఆయన ఇనుప"దండముతో నలుగగొట్టునని కీర్తనాకారుడు అనెను?
ⓐ దుష్టులు - దుర్మార్గులు
ⓑ శత్రువులు - కోపిష్టులు
ⓒ విగ్రహారాధికులు - మూఢులు
ⓓ భూరాజులు - ఏలికలు
5. ఎవరి కుమారుల తిరుగుబాటును బట్టి వారిని "దండముతో" శిక్షించెదనని యెహోవా అనెను?
ⓐ యోబు
ⓑ అహరోను
ⓒ దావీదు
ⓓ మోషే
6. యెహోవా తన పరిపాలన "దండమును" ఎక్కడ నుండి సాగజేయుచున్నాడు?
ⓐ తిర్సాలో
ⓑ సీయోనులో
ⓒ మహనయీములో
ⓓ షోమ్రోనులో
7. భక్తిహీనుల రాజ "దండము"ఎవరి స్వాస్థ్యము మీద నుండదు?
ⓐ నీతిమంతుల
ⓑ యధార్థవంతుల
ⓒ సహాయకుల
ⓓ మంచివారి
8. యెహోవా తన "వాగ్ధాండము" చేత ఎవరిని కొట్టును?
ⓐ పర్వతములను
ⓑ లోకమును
ⓒ అరణ్యములను
ⓓ సముద్రములను
9. యెహోవా తన "దండముతో" ఎవరిని కొట్టగా అది ఆయన స్వరము విని భీతి నొందును?
ⓐ తూరును
ⓑ ఎదోమును
ⓒ అష్టూరును
ⓓ అమోరియాను
10. బలమైన ప్రభావము గల రాజ"దండము"విరిగిపోయెనే అని చెప్పుకొనకుడని యెహోవా దేనితో అనెను?
ⓐ బబులోనుతో
ⓑ మోయాబుతో
ⓒ అమ్మోనియాతో
ⓓ ఎదోముతో
11. ఏ దినమున "దండము"పూచియున్నదని యెహోవా అనెను?
ⓐ తీర్పు దినమున
ⓑ శ్రమల దినమున
ⓒ అంతము వచ్చుదినమున
ⓓ తెగులు వచ్చు దినమున
12. తనను కొట్టిన "దండము"తుత్తునియలుగా విరువబడెనని ఎవరిని సంతోషింప కుమని యెహోవా చెప్పెను?
ⓐ ఫిలిష్తియాను
ⓑ దమస్కును
ⓒ అష్షూరును
ⓓ బబులోనును
13. ఎవరు "దండమెత్తి"నట్లు యెహోవా దానినెత్తును?
ⓐ కూషీయులు
ⓑ ఐగుప్తీయులు
ⓒ సీదోనీయులు
ⓓ తర్షీషీయులు
14. రాజ "దండము" ఎవరిలో నుండి లేచును?
ⓐ ఎఫ్రాయిమీయుల
ⓑ ఇశ్రాయేలీయుల
ⓒ రేకాబీయుల
ⓓ మనషేయుల
15. యెహోవా "దండము" ఎక్కడి వరకు వచ్చును?
ⓐ భూదిగంతము
ⓑ ఎత్తైన పర్వతము
ⓒ నలుదిక్కుల
ⓓ సముద్రము
Result: