Bible Quiz in Telugu Topic wise: 391 || తెలుగు బైబుల్ క్విజ్ ("దయ" అనే అంశము పై క్విజ్)

1: ఏది దీర్ఘకాలము సహించును, "దయ" చూపించును?
A త్యాగం
B నీతి
C ప్రేమ
D బుద్ధి
2. "దయను" సత్యమును ఎన్నడును విడిచి పోనియ్యక దేనిగా ధరించుకొన వలెను?
A శిరస్త్రాణముగా
B కవచముగా
C కంఠభూషణముగా
D కేడముగా
3Q. నీ కటాక్షము నాయెడల కలుగునట్లుగా "దయ" చేసి నీ మార్గమును నాకు తెలుపుమని ఎవరు యెహోవాతో మనవి చేసెను?
A యెహోసువా
B దావీదు
C మోషే
D అబ్రాహాము
4 Q. యెహోవా ఎవరిని కేడెముతో కప్పినట్లు "దయ"తో కప్పెను?
A విశ్వాసులను
B శత్రువులను
C నీతిమంతులను
D యదార్ధవంతులను
5. ఏది "దయ"ను సంపాదించును?
A జ్ఞానము
B సుబుద్ధి
C తెలివి
D వివేకము
6Q. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తన జనులకు ఏమి "దయ"చేసియున్నాడు?
A ఘనత
B కలిమి
C నెమ్మది
D విశ్వాసం
7Q. "దయా"ప్రాప్తురాలా నీకు శుభము; అని దూత ఎవరితో చెప్పెను?
A ఎలీసబెతు
B లుదియా
C మగ్దలేనే మరియ
D మరియ
8 Q. "దయ" చేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వదించుమని ఎవరు ప్రార్ధించెను?
A యెహోసువ
B హిజ్కియా
C సొలొమోను
D దావీదు
9 Q. జనులలో ఎవరు దేవుని "దయను" వెదకుదురు?
A పాపాత్ములు
B ఐశ్వర్యవంతులు
C నీతిమంతులు
D సత్వికులు
10 Q. యెహోవా ప్రభువా, "దయ"చేసి ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసి కొనుము, అని ఎవరు ప్రార్ధించెను?
A కాలేబు
B సంసోను
C గిద్యోను
D యాయీరు
11: తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా ఏమైయున్నాడు?
A భయంకరుడు
B కోపావేశుడు
C దయాళుడు
D పక్షపాతి
12 Q. "దయా దృష్టిగలవాడు తన ఆహారములో కొంత ఎవరికిచ్చును అట్టివాడు దీవెననొందును?
A స్నేహితునికి
B దరిద్రునికి
C పొరుగువానికి
D దీనునికి
13. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న యెడల సమస్తమైన వేటిని మానుకొనెదరు?
A దుష్టత్వమును
B వేషధారణను
C దూషణ మాటలను
D పైవన్నియు
14Q. బాలునిగా ఉన్నప్పుడు యెహోవా "దయ యందును మనుష్యుల "దయ యందును ఎవరెవరు వర్ధిల్లెను?
A సొలొమోను, దావీదు
B యోహాను, సుమెయోను
C యేసు,సమూయేలు
D యెహోషాపాతు, ఆసా
15: దయ చేసి నాకు కీడు రాకుండ దానిలో నుండి నన్ను తప్పించుము అని ఎవరు ప్రార్ధించెను?
A దావీదు
B యాకోబు
C యబ్బేజు
D బోయజు
Result: