① . దానియేలు యూదా రాజైన ఎవరి కాలములో బబులోను చెరకు పోబడెను?
② దానియేలు అనగా అర్ధము ఏమిటి?
③ దానియేలు అనగా గ్రీకు భాషలో అర్ధము ఏమిటి?
④ దానియేలును ఏ ప్రవక్త అని పిలుచుదురు?
⑤ దానియేలు సకలవిధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు ఏమిగలవాడై యుండెను?
⑥ దానియేలు నపుంసకుల యధిపతి యైన ఎవరికి అప్పగింపబడెను?
⑦ ఏ రాజు కనిన కలను కలభావమును దానియేలు వివరించెను?
⑧ నెబుకద్నెజరు దానియేలును బబులోనులోని ఎవరందరిలో ప్రధానునిగా నియమించెను?
⑨ ఎవరి ఆత్మ దానియేలులో యున్నదని నెబుకద్నెజరు అనెను?
①⓪ దానియేలు నెబుకద్నెజరు గురించి ఎంతసేపు అతివిస్మయమొందెను?
①① దానియేలుకు ఊదారంగు వస్త్రము తొడిగించిన రాజు ఎవరు?
①② దానియేలు నిమిత్తము బహువ్యాకులపడిన రాజు ఎవరు?
①③ దానియేలు తాను కనిన కలను ఎలా వివరించి వ్రాసెను?
①④ నాశనమైన దేని గురించి దానియేలుకు దర్శనము కలిగెను?
①⑤ యేసును గూర్చిన ప్రవచనము దానియేలుకు ఏ ఆధ్యాయములో తెలుపబడెను?
Result: