Bible Quiz in Telugu Topic wise: 397 || తెలుగు బైబుల్ క్విజ్ ("దాసుడు-దాసురాలు" అనే అంశముపై క్విజ్)

①.యెహోవా "దాసుడైన" అబ్రాహాము వంశస్థులను ఆయన యొక్క ఏమి జ్ఞాపకము చేసుకొనుమని కీర్తనాకారుడు అనెను?
Ⓐ ఉన్నతకార్యములను
Ⓑ గొప్పకార్యములను
Ⓒ ఆశ్చర్యకార్యములను
Ⓓ మహాత్కార్యములను
②. నా "దాసుడైన దావీదు నిమిత్తము ఒక గోత్రము నీ కుమారునికిచ్చెదనని యెహోవా ఎవరితో అనెను?
Ⓐ సొలొమోను
Ⓑ రెహబాము
Ⓒ యెహోషాపాతు
Ⓓ అబీయా
③. నీ "దాసుడు" ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మని ఎవరు యెహోవాతో అనెను?
Ⓐ గిద్యోను
Ⓑ హిజ్కియా
Ⓒ యెషయా
Ⓓ సమూయేలు
④ దేవుని "దాసుడగు"మోషే కీర్తనను పాడుచున్నదెవరు?
Ⓐ జయించినవారు
Ⓑ దేవదూతలు
Ⓒ పెద్దలు
Ⓓ సమూహము
⑤ క్రీస్తు యేసు "దాసుడైన "పౌలు అని ఏ పత్రికలో కలదు?
Ⓐ గలతీ
Ⓑ ఫిలిప్పీ
Ⓒ ఎఫెసి
Ⓓ కొరింథీ
⑥ ప్రభువు తన "దాసురాలి"దీనస్థితిని కటాక్షించెనని ఎవరు అనెను?
Ⓐ హన్నా
Ⓑ రుతు
Ⓒ మరియ
Ⓓ అన్న
⑦. నీ "దాసురాలనైన"నన్ను మాటలాడనిమ్మని ఎవరు దావీదుతో అనెను?
Ⓐ మీకాలు
Ⓑ బత్తెబ
Ⓒ ఆహీనోయము
Ⓓ అబీగయీలు
⑧. క్రీస్తు యేసు "దాసుడైన"ఎవరు కొలొస్సయులకు వందనములు చెప్పుచుండెను?
Ⓐ ఏపప్రా
Ⓑ అర్జిప్పు
Ⓒ మార్కు
Ⓓ సీల
⑨ నీతో సహ"దాసుడను"దేవునికే నమస్కారము చేయుమని దూత ఎవరితో అనెను?
Ⓐ పేతురు
Ⓑ యోహాను
Ⓒ యాకోబు
Ⓓ యూదా
①⓪. సాతాను చెరపట్టిన వారిని ప్రభువు యొక్క "దాసుడు"ఎలా శిక్షించవలెను?
Ⓐ దీర్ఘశాంతముతో
Ⓑ దయాళుత్వముతో
Ⓒ సాత్వికముతో
Ⓓ మంచితనముతో
①① సమాధానముతో నీ "దాసుని" పోనిచ్చుచున్నావని ప్రభువుతో ఎవరు అనెను?
Ⓐ నీకోదేము
Ⓑ యోసేపు
Ⓒ నతనయేలు
Ⓓ సుమెయోను
①②. నీవు నా "దాసుడవని"యెహోవా ఎవరి గురించి అనెను?
Ⓐ యూదా
Ⓑ లేవి
Ⓒ యాకోబు
Ⓓ హిజ్కియా
①③ మేము ఎటువంటి "దాసులమని"చెప్పుడని యేసు తన శిష్యులతో చెప్పెను?
Ⓐ బలహీనులమైన
Ⓑ నిష్ ప్రయోజకులమైన
Ⓒ ఎన్నికలేనివారమైన
Ⓓ తృణీకరింపబడినవారమైన
①④. "దాసుని "స్వరూపమును ధరించుకొనిన క్రీస్తు యేసు తన్నుతానే ఎలా చేసికొనెను?
Ⓐ రిక్తునిగా
Ⓑ ఒంటరిగా
Ⓒ శాపముగా
Ⓓ పాపముగా
①⑤. పాపమునకు "దాసులమైన"మనము క్రీస్తు రక్తము వలన దేనికి "దాసుల"మైతిమి?
Ⓐ సత్యమునకు
Ⓑ ఆత్మకు
Ⓒ నీతికి
Ⓓ న్యాయముకు
Result: